Ayurvedic Treatment For Autism

Autism articles

ఆటిజం -ఆందోళన -ఆయుర్వేదం చికిత్స:  Ayurvedic Treatment For Autism

 

పిల్లల పుట్టినప్పటి నుంచీ వాళ్ళని వాళ్ళ ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలని తల్లితండ్రుల కోరిక. పిల్లల ఎదుగుదల క్రమంలో ఏ విధమైన లోపం వచ్చినా తీవ్ర ఆవేదనకి గురి అవుతారు.

ఈ పిల్లల ఎదుగుదల క్రమంలో చిన్న చిన్న లోపాలు సహజం కానీ కొన్ని రకములైన లోపాలు ప్రత్యేకమైనవి ఉదాహరణకు ఆటిజం మరియు హైపర్ ఆక్టివిటీ ముఖ్యమైనవి.

Ayurvedic Treatment For Autism!

Ayurvedic Treatment For Autism

ఈ మధ్యకాలంలో తల్లి తండ్రులని ఎక్కువగా కలవరపెడుతున్న సమస్య Autism

ఆటిజం అనే పదాన్ని భారతీయులు ఈ మధ్య తరచుగా వింటున్నారు, చాలామంది తల్లితండ్రులకి ఆటిజం అంటే ఏంటో కూడా అవగాహన లేదు. ఈ ఆటిజం అనేది పాశ్చ్యాత దేశాలలోనే ఎక్కువగా ఉంటుందని అనుకున్నాము కానీ మన దేశంలో కూడా ఆటిజం లక్షణాలతో బాధ పడేవారి సంఖ్య పెరిగింది.

దీనికి సాక్ష్యంగా మానసిక వైద్యుల వద్దకు వెళ్ళే పిల్లల సంఖ్య పెరగటం.

ఆటిజం అనేది ఒక వ్యాధి కాదు ఇది కొన్ని లక్షణాల సముదాయం, జనాలలో ఆటిజం అంటే మానసిక రుగ్మత అనే అపోహ ఉంది కానీ ఈ రెండూ రెండు విభిన్న చట్రాలు.

సహజముగా ఆటిజం(Autism) లక్షణాలని 18 నెలలు వయస్సు నుంచే గుర్తించవచ్చు.

పిల్లల ఎదుగుదల క్రమములో మెడ నిలబెట్టడం, ప్రాకడం, తప్పటడుగులు వెయ్యడం,అత్త తాత అని పిలవడం తల్లిదండ్రులను గుర్తించి నవ్వడం వంటి వాటిలో ఏ మాత్రము లోపం కనిపించిన వెంటనే గుర్తిస్తారు.

ఆటిజం మీద అవగాహన లేని తల్లిదండ్రులు ఈ ఎదుగుదల లోపం మీద ద్రుష్టి సారించకపోతే ఈ లక్షణాలు ఇంకా తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలలో ఆటిజం ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది అన్న అంచనాలు తెలియలేదు

పిల్లలు వాళ్ళు పెరిగే క్రమములో సాధారణ స్థాయి కి భిన్నముగా ఉండటాన్ని ఆటిజం అని చెప్పవచ్చు

ఆటిజం లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండాలని లేదు కొంతమంది లో కొన్ని లక్షణాలు ఉండవచ్చు ఇంకొంతమందిలో ఉండకపోవచ్చు

 

ఈ ఆటిజంలో చాలా రకాలు ఉన్నాయి అందులో కొన్ని ఇప్పుడు చూద్దాం:

 

పిల్లలు పుట్టినప్పుడు బాగానే ఉంటారు. ఒకటి రెండు ఏళ్ళ వరకు కూడా ఎదుగుదల చాలా బాగుంటుంది. ప్రాకడం,నిలపడటం,మాట్లాడటం, బానే వస్తాయి.

ఆ తరువాత అకస్మాతుగా ఎదుగుదల వెనక్కి మల్లటం మొదలవుతుంది .దాని మూలంగా పిల్లలకు వచ్చిన మాటలు కూడా మాట్లాడలేకపోతారు. దీనినే చైల్డ్ హుడ్ డిసింటెగ్రేటెడ్ిసార్డర్ అంటారు. ఈ ఆటిజం అనేది ఆడపిల్లలో కన్నా మగపిల్లలోనే ఎక్కువగాఉంటుంది.

 

Aspergers డిసార్డర్:

ఇది మగపిల్లలో చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఆటిజం పిల్లలో మాటలు చాలా ఆలస్యంగా వస్తూ  ఉంటాయి, కానీ ఈ రకంలో మాటలు మాములుగా  ఉంటాయి కానీ తక్కువ మాట్లాడుతుంటారు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్తుంటారు. మిగతా ఆటిజం పిల్లలతో పోలిస్తే ఇతరులతో బాగానే కలుస్తారు.

 

రెట్ట్స్ డిసార్డర్:

  • అరుదైన ఈ రకం ఆడపిల్లలో ఎక్కువగా కనపడుతుంది. దీని ప్రత్యేకత ఏమంటే పుట్టిన ఏడాది వరకు పిల్లలు బాగానే ఉంటారు ఆ తరవాత లక్షణాలు కనపడటం మొదలవుతుంది. ఇవి రెండు మూడు ఏళ్ళలోనే వేగంగా తీవ్రమవుతాయి. అప్పటికే వచ్చిన ఒకటి రెండు మాటలు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. ఇది ముదిరే రకం కావటం వల్ల కొంత కాలానికి నాడి సంబంధ సమస్యలు ఆరంభం అవుతాయి
  • సరిగ్గా నడుము నిలపలేకపోవటం వంటి వాటితో మొదలై మెల్లగా ఫిట్స్ కూడా వస్తాయి. సాధారణంగా వయసుతో పాటు పెరగాల్సిన తల విరీలో చిన్నది అవుతుంది.చొంగ కారటం, చేతులు కాళ్ళు ఒకేరకంగా ఆడిస్తుండటం, చేతులతో చప్పులు చేయటం వంటివి కనపడతాయి.
  • యుక్తవయసుకి ముందే సమస్యలు బాగా ముదిరి వీరు బ్రతికి బట్ట కట్టటం కూడా కష్టమవుతుంది.

 

ఈ ఆధునిక యుగంలో తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగరీత్యా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు పిల్లలని డేకేర్ లో ఉంచడం వల్ల ఆ పిల్లలు తల్లిదండ్రుల ప్రేమ కు దూరము అవ్వడం వల్ల ఈ ఆటిజం లక్షణాలు కనిపిస్తున్నాయి అనే అపోహ ఉండేది కానీ ఇంటి వద్దే ఉండి పిల్లలని  కనుపాపలా చూసుకుంటున్న వారిలో కూడా ఈ లక్షణాలు చూస్తున్నాము;

మనం పైన చెప్పుకున్నట్టు ఇది మానసిక రుగ్మత /బుద్ది మాంద్యము కాదు.ఎందుకంటే మానసిక రుగ్మతతో బాధపడే వారు ఎవరితో కలవకుండా మందకొడిగా ఉంటారు.ఏది త్వరగా గ్రహించలేరు కానీ ఆటిజం ఉన్న పిల్లల్లోని కొంతమంది ఎవరితో కలవకపోయిన చెప్పింది విని త్వరగా  గ్రహించగలిగే శక్తి వీరిలో చాలా ఎక్కువుగా ఉంటుంది కావునా ఈ రెండు వేరు వేరు అని గ్రహించాలి.

 

ఈ ఆటిజం లో చాలా లక్షణాలు ఉన్నాయి అందులో ఎక్కువుగా కనిపించేవి ఇప్పుడు చూద్దాము.

18 నెలలు పైబడిన వారిలో:

  • కారణము లేకుండా ఎక్కువుగా ఏడవడము
  • గంటల తరబడి స్తబ్దుగా ఉండడము
  • తల్లి దగ్గరకు తీసుకుంటున్న పెద్దగా స్పందించకపోవడం
  • తెలిసిన వ్యక్తులను చూడగానే నవ్వకపోవడం
  • మాటలు సరిగ్గా పలకలేకపోవడం
  • పదే పదే పిలిచినా స్పందన లేకపోవడం
  • ఎవరి దగ్గరకు వెళ్ళకపోవడం

 

3 సంవత్సరాలు పై బడిన వారిలో:

  • మాటలు సరిగ్గా రాకపోవడం
  • తోటి వాళ్ళతో కలవలేకపోవడం
  • పిలిస్తే స్పందన లేకపోవడం
  • ఒంటరిగా ఉండడానికి ఆడుకోవడానికి ఇష్టపడడం
  • మనుష్యులు కంటే బొమ్మలు పట్ల ఆసక్తి చూపించడం
  • కళ్ళలోకి సూటిగా చూడలేకపోవడం
  • భావవ్యక్తీకరణ లేకపోవడం ఉదాహరణకు వారికి కావలసిన కనీస అవసరాలను చెప్పలేకపోవడం
  • వారి వస్తువులు వేరే వాళ్ళు తీసుకుంటే ఇష్టపడరు
  • కొంత మంది పిల్లలలో ఏదైనా గాయం అయిన స్పందించకపోవడం
  • వయస్సు తగినట్టు భాష ప్రకటించలేకపోవటం
  • మనం అడిగిన దాన్నే వాళ్ళు అదేతిరిగి అడగటం
  • మనం అడిగిన ప్రశ్నకు వెంటనే స్పందించకుండా తరవాత ఎప్పుడో స్పందిస్తారు
  • పొంతన లేకుండా మాట్లాడటం
  • ఒకే వస్తువు మీద విపరీతమైన ప్రేమ పెంచుకొని ఎప్పుడు ద్యాస దాని మీద ఉండి ఎవరైనా వారి వద్దనుండి దాన్ని తీసుకుంటే విపరీతంగా కోపం రావటం
  • ఏదైనా చిన్న చిన్న వస్తువులని తీసుకోని పదే పదే పళ్ళకేసి కొట్టుకోవటం
  • వీరి యొక్క ప్రవర్తన ధోరణి వింతగా ఉంటుంది వారు అడిగింది
  • ఇవ్వకపోతే పెద్దగా అరవటం, వారిని వారు గాయం చేసుకోటం లేదంటే ఇతరులని గాయ పరచటం
  • అయితే  కిందకి చూడటం లేదా పైకి చూడటం కానీ చేయటం
  • పదే పదే పక్కకి చూడటం
  • చిన్న చిన్న శబ్దాలకు చెవులు ముసుకోవటం, భయపడటం
  • తడి చేతులతో వాళ్ళని ముట్టుకుంటే ఇష్ట పడకపోవటం
  • దినచర్యలో ఏ మాత్రం తేడా వచ్చిన సహించలేకపోవటం
  • ఒకేచోట స్థిరంగా ఉండలేకపోవటం
  • కొంత మందిలో మేధా శక్తి సాధారణ స్థాయిలో ఉంటె మరి కొంత మందిలో మేధాశక్తి  విపరీత స్థాయిలో ఉంటుంది
  • కొంత మంది ఆటిజం ఉన్న పిల్లలో ఫిట్స్, మెదడు మరియు నాడి సమన్వయ వ్యవస్థ దెబ్బ తినటం
  • మానసిక ఎదుగుదల లోపం కూడా కనిపిస్తుంది
  • కొంత మంది పిల్లలు రోజు మొత్తం మీద రెండు లేదా మూడు  గంటలు మించి నిద్ర పోకుండటం
  • చాలా చిరాకు పడుతుండడం
  • రాత్రి అంతా మేలుకొని తమలో తాము ఆడుకోవటం

Ayurvedic Treatment for Autism:

ఆయుర్వేదం ప్రకారంగా ఈ Autism అనేది వాత దోష ప్రకోపం వల్ల వస్తుంది, వాత మరియు పిత్త దోషాల అసమతుల్యత వలన ఆటిజం మరియు ADHD లక్షణాలు కనిపిస్తాయి.

ఆయుర్వేద చికిత్సలో అద్భుతమైన వైద్య పద్దతుల ద్వారా ఈ ఆటిజం యొక్క లక్షణాలని తగ్గించవచ్చు మరియు లక్షణాలను ఆధారముగా చేసుకొని ఆయుర్వేద చికిత్స విధానము ఉంటుంది

పంచకర్మ పద్దతులలో అభ్యంగన, నస్య, శిరోధార, శిరోపిచు, శిరోబస్తీ, బస్తి మొదలగు చికిత్సా పద్ధతులు పిల్లలలో గల దోష ప్రభావముల  తీవ్రత మీద ఆధారపడివుంటుంది

పంచకర్మ చికిత్స పద్దతుల ద్వారా శరీరములో గల మలినాలను తొలగించి, శరీరానికి పునర్జీవనశక్తిని కలిగిస్తుంది

 

తీసుకోవల్సిన జాగ్రత్తలు:

  • ఈ ఆటిజం లక్షణాలు ఉన్న  పిల్లల తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురి అయ్యి నలుగురిలోనూ చిన్నతనంగా అనుకొని పిల్లలని ఎవరితోనూ కలవనివ్వకుండా ఇంటి దగ్గరే ఉంచుతారు. అలా కాకుండా పిల్లలని నలుగురితో కలిసిమెలిసి తిరిగేలా చెయ్యడంవల్ల వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావొచ్చ.
  • మొబైల్ మరియు టి.వి .వంటి వాటికి దూరముగా ఉంచాలి.
  • కాఫీ టీ మరియు శీతల పానీయాలకు దూరముగా ఉంచాలి . లేనియెడల వారిలోని వాత మరియు పిత్త దోషాల ప్రభావము పెరిగి కోపం ,చికాకు ,అసహనం మరియు అలసట ఎక్కువ అవుతాయి.
  • ఆవు పాలు మరియు పాలపదార్థాలు ఎక్కువుగా ఇవ్వవలెను.
  • నిల్వపదార్థాలు పెట్టకూడదు.
  • పిల్లల కోసం ఎక్కువ సమయము కేటాయించాలి.
  • పిల్లలు వింతగా ప్రవర్తించినప్పుడు వారిని కోపగించుకోకుండా ప్రేమగా దగ్గరకు తీసుకొని అర్ధం అయ్యేలా చెప్పాలి.
  • పిల్లలు మంచిపనులు చేసినప్పుడు అభినందించాలి .ఈ విధముగా అభినందించడం వల్ల వారిలో మంచిలక్షణాలు అలవడుతాయి.
  • ఆటిజం తో బాధపడుతున్న పిల్లల యొక్క తల్లిదండ్రులకు వారి యొక్క జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల సహకారము చాలా అవసరము.
  • తల్లిదండ్రులు ఓర్పు శ్రద్ద మరియు సహనంతో ఉంటె పిల్లల వైకల్యాన్నిపారద్రోలి వారిలో ఆత్మస్తైర్యముని పెంపొందించిన వారు అవుతారు.

 

ఆయుర్వేద చికిత్సా విధానము:-

 

Ayurvedic Treatment For Autism

0 Comments

Submit a Comment

Your email address will not be published. Required fields are marked *

Dr. Santhisree Bheesetti

Driven by her passion, she has cultivated a profound understanding of complex conditions like Autism, ADHD, Cerebral Palsy, Down Syndrome, Speech disorders, and Anxiety disorders, alongside her specialization in Women’s issues and Neurological disorders in adults.
Understanding the Benefits of Takradhara for Children on the Spectrum

Understanding the Benefits of Takradhara for Children on the Spectrum

Ancient wisdom often holds solutions that exceed time, providing solutions that are both gentle and effective. Takradhara, an Ayurvedic therapy, is one of the practices that has stood still for centuries. Deeply rooted in holistic healing, this practice has gained...

Ready to Restore Harmony in Your Mind, Body, and Spirit

Our Treatments

Panchakarma

Shiro Abhyanga

Nasya Karma

Takradhara

Vasti Benefits

Open chat
1
Hi!
How Can I Help You?