Vasti Benefits
వస్తి కర్మ అనేది పంచకర్మలో విభాగం.
రోగాన్ని బట్టి ఔషదాన్ని నిర్ణయించి దాన్ని anus ద్వారా ఎనిమా ఇవ్వడమే వస్తి కర్మ. దీనిలో చాలా రకాలు ఉన్నాయి.
వైద్యుని పర్యవేక్షణలో బాగా తయారుచేసి ఇచ్చిన వస్తి, పక్వాశయం (intestines), thighs, lower abdomen లో వ్యాపించి నిలిచి ఉంటుంది. ఈ వ్యాపించి నిలిచి ఉన్న వస్తి ద్రవ్యముల యొక్క సారం చిన్న చిన్న రంధ్రముల ద్వారా శరీరము అంతటా వ్యాపిస్తుంది. ఏ విధంగా అంటే చెట్టు మొదలు తవ్వి పోసిన నీరు చెట్టు, వేర్లు మరియు చెట్టు యొక్క అన్ని భాగాలకు ఎలా వ్యాపిస్తుందో అదే విధంగా ఈ వస్తి కూడా మనిషి యొక్క శరీర భాగాలలో ప్రతీ కణజాలానికి చేరుకొని వ్యాధి నివారణకు దోహద పడుతుంది.
వస్తి కర్మ ద్వారా లోపలికి పంపించబడిన ఔషదాలు శీఘ్రముగా దోషములతో కూడి బయటకి వచ్చును లేదా వాయువు సహాయముతో ఆయా స్థానములలో దాగి ఉన్న దోషములను వేర్లతో సైతం పెకిలించి బయటకి తరిమేస్తుంది.
వస్తి కర్మ తన యొక్క ప్రభావముచే ఎంతటి మొండి వ్యాధినైనా సరే మూలాలతో సైతం పెకిలించి ఆ వ్యాధి లక్షణాలను తగ్గించడమే కాకుండా మరలా ఆ వ్యాధిని పునరావృతం కాకుండా చేయడంలోనూ, శరీరానికి పునర్జీవన శక్తి ని కల్పించడంలో అద్భుతముగా పనిచేస్తుంది.
వస్తి కర్మ తన ప్రభావంతో ఆపాద మస్తకమునందు వ్యాపించి ఉన్న దోషాలను వేర్లతో సైతం పెకిలిస్తుంది కావున పంచకర్మ చికిత్సలలో వస్తి ముఖ్య పాత్ర పోషిస్తుంది.
చాలా మందికి వస్తి కర్మ మీద చాలా అపోహలు ఉన్నాయి.వస్తి అంటే ఎనిమా యే కదా హాస్పిటల్ కి వెళ్లి చేయించుకోవడం ఖర్చుతో కూడుకున్నది అని భావించి ఇంటి వద్దే సోప్ వాటర్ ఎనిమా సర్వ దోష హరమని, చెడు అంతా బయటకి తరిమేస్తుంది అని చేసుకుంటూ ఉంటారు .కానీ సోప్ లో ఉండే రసాయనాలను intestines పీల్చుకోక పోవడం వల్ల ఆ రసాయనాలు కడుపులో నిల్వ ఉండడం వలన శరీరంలో నానా అవస్థలు( కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు, విపరీతమైన విరేచనాలు, నీరసం, కళ్ళు తిరగడం) తలెత్తుతాయి.
ఈ వస్తి కర్మ వాత, పిత్త,శ్లేష్మ, రక్త దోషాలకు చాలా బాగా పని చేస్తుంది. ఎటువంటి వ్యాధికైనా వస్తి కర్మతో ఉపశమనం కలుగుతుంది. ఇంగ్లీష్ మెడిసిన్లో ఇంజక్షన్ ఎంత త్వరగా పనిచేస్తుందో ఈ వస్తి కర్మ అంత కన్నా తక్కువ సమయంలోనే మంచి ఫలితాలను ఇస్తుంది. ఆయుర్వేద పంచకర్మ చికిత్సలలో ఈ వస్తి కర్మ అద్భుతంగా పనిచేస్తుంది. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు వస్తి కర్మ ఒక అద్భుతమైన యోగం.
వాస్తవం చెప్పాలంటే చాలా దీర్ఘకాలిక వ్యాధులు ఆపరేషన్ లేకుండానే ఈ వస్తి కర్మ ద్వారా నిపుణులైన వైద్యుల పర్యవేక్షణతో మంచి మూలికలు ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వ్యాధిని తగ్గించడంతో పాటు బలమును,తేజస్సును , యవ్వనమును ఇమ్మ్యూనిటిను పెంచుతుంది.
వస్తి కర్మ రెండు రకాలు నిరూహవస్తి , స్నేహికవస్తి.
వస్తి కర్మ వివరాలు:
**వస్తి కర్మలు చాలా మూలికలు కలిపి చేయడం వల్ల దోషాలను పోగొట్టడంలోనూ, వ్యాధుల నుంచీ ఉపశమనం పొందడంలోనూ, శరీరబలం పెంచడంలోనూ ఉపయోగ పడుతుంది.
**శుక్రము తక్కువగా ఉంటే దాన్ని బలపరిచి, శారీరిక బలమును పెంచును.
**యవ్వనంగా ఉంచును.
**శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, మంచి రంగు, బలము, ఆరోగ్యము, ఆయుర్వృద్ధి కలుగుతుంది.
**స్థూలకాయం ఉన్నవారిని సన్నగా చేయును.
**శరీరంపై ముడతలు తగ్గించి,బాల నెరుపు, మొదలగు వృద్ధాప్య లక్షణాలు రానివ్వదు.
**కండరాలను బలముగా చేయును.
**క్షిణించి, చిక్కిపోయి,కృశించినవారికి పుష్టిని కలుగ చేస్తుంది.
వస్తి కర్మ చికిత్స ద్వారా ఏ ఏ వ్యాధులు నివారణ చెయ్యచ్చు:
జ్వరము, అతిసారము, తిమిరము, వదలని పడిశము, శిరోవేదన, శుక్ర నాశము, మూఢగర్భము, piles, Male infertility, Female infertility, Azoospermia, uterine fibroids, PCOD, Gastro intestinal disorders, Arthritis, kidney stones, Lumbar spondylosis, rheumatoid arthritis, Ankylosing spondylosis, Skin diseases, Sciatica, Osteoarthritis, Obesity, Kidney failure, Autism, ADHD, పక్షవాతము మొదలగు వాటి యందు చాలా ఉపయోగకరము.
వస్తి ఏ వయస్సు వారికి చెయ్యచ్చు?
వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్న పిల్లలు నుంచీ మొదలుకొని పెద్ద వాళ్ళ వరకు చెయ్యచ్చు.
వస్తి ఇచ్చు మార్గములు Urethral, Vaginal, Anal.
Follow
Facebook,
Twitter ,
Blog
#AyurvedatreatmentforInfertility
#AyurvedatreatmentforAutism
#Panchakarmatreatmentfor #Maleinfertility
#Keralatreatments #VIZAG #Hyderabad
#Panchakarmatreatmentfor #AUTISM in #VIZAG
#Ayurvedapanchakarmatreatmentinvizag
#Keralatreatmentforchronicdiseasesinvizag
#Drsanthisreebheesetti
#SreePrathamaPanchakarmaHospitals
#Ayurvedatreatmentforkidsinvizag
0 Comments