Home_Remedies to Stay younger and Extraordinary even at 75 years of age

#ఆయుర్వేదంతో వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యం గా జీవించండి ఇలా!!

ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటే వృద్ధాప్యంలో అయినా చలాకీగా ఉండవచ్చు.
ఆయుర్వేదం వృద్ధులు జీవించినంత కాలం ఆరోగ్యవంతం గా, వ్యాధులకు దూరంగా బతికేందుకు తోడ్పడుతుంది. ఈ శాఖను ఆయుర్వేదంలో జర చికిత్స అంటారు. అంటే వృద్ధాప్య థెరపీ. దీనికి రసాయన అనే మరో పర్యాయపదం కూడా ఉన్నది. అంటే వ్యాధి నిరోధక, స్వయం సంరక్షక చర్యలు అని అర్ధం. ఆయుర్వేదం ప్రకారం 70 ఏళ్ళు దాటిన సంవత్సరానికి వృద్ధాప్యం ప్రారంభమవుతుంది.

కానీ నలభై దాటినప్పటి నుంచే వృద్ధాప్య లక్షణాలు ప్రారంభం కావడం నేటి అనుభవం.
శక్తి, బలం క్షీణించి, జీవితాన్ని చురుకుగా గడపలేకపోతారు. ఈ దశలో వ్యక్తిని అలసట, నిస్సత్తువ ఆవరిస్తాయి.
భౌతిక, మానసిక కార్యకలాపాలు కుంటుపడతాయి. జ్ఞాపకశక్తి, మేధస్సు క్షీణించడం ప్రారంభమై వ్యాధులు త్వరగా ప్రభావితం చేస్తుంటాయి.

ఆయుర్వేదం ప్రకారం రస, రక్త, మాసం, మేధస్‌, అస్థి, మజ్జ, శుక్ర ధాతులతో కూడినది మానవ శరీరం. శరీరంలో చోటు చేసుకునే మార్పుల వల్ల ఈ ధాతువులు క్షీణిస్తాయి. ఈ ధాతువులలో సారంతరగిపోవడంతో రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధులు త్వరగా సంక్రమించే సున్నితమైన ఆరోగ్య పరిస్థితులు ఏర్పడతాయి.

వృద్ధాప్యంలో ఈ ధాతువుల సామర్ధ్యాన్ని పెంచలేం కానీ వాటిని సంరక్షించి పునరుజ్జీవింపచేయవచ్చు.
రసాయన చికిత్స లాభాలను ఆయుర్వేద గ్రంథాలు సవివరంగా పేర్కొంటాయి.
#జీవితాన్ని పొడిగించడం, #జ్ఞాపకశక్తిని పెంచడం, ఇన్ఫెన్లు, వ్యాధులు రాకుండా #నిరోధక శక్తిని, మనస్సును యవ్వన స్థితిలో ఉంచేందుకు సాయపడడం, వ్యక్తి ఛాయతో పాటు గొంతును మెరుగుపరచడం ద్వారా సమాజంలో గౌరవనీయంగా జీవించేందుకు, సంపూర్ణ ఆరోగ్యా న్ని సాధించేందుకు ఈ ప్రత్యేక చికిత్స అభివర్ణిస్తుంది.
ఆయుర్వేదం #వృద్ధాప్య సమస్యలను గుర్తించడమే కాదు అటువంటివి సంభవించకుండా నిరోధించే చికిత్సలను రూపొందించింది.

#వృద్ధాప్యసమస్యలు:

#అశక్తత, నిస్సత్తువ, #వ్యాధులు, మరణం పట్ల భయం అన్నవి వృద్ధాప్యంలో ప్రధానంగా కనుపించే సమస్యలు.

వయోధికులలో కనుపించే ఇతర సమస్యలు-

కేంద్ర నరాల వ్యవస్థ, మెదడు: పక్షవాతం, సయాటికా, అల్జీమర్స్‌ వ్యాధి, పార్కిన్సన్స్‌ వ్యాధి, మూర్ఛ, న్యూరోసిస్‌, సైకోసిస్‌, మానసిక సమస్యలు, నిద్రలేమి.

గుండె, రక్త నాళాలు: ఆంజినా పెక్టోరిస్‌, హృదయదమని లోపాలు, హైపర్‌టెన్సివ్‌ గుండె జబ్బులు, గుండెపోటు, గుండెకు సంబంధించిన ఇతర సమస్యలే కాకుం డా జన్యుపరమైన, జీవక్రియా సంబంధ సమస్యలైన మైలాయిడ్‌ లుకేమియా.

కాలేయం, పిత్తాశయ సమస్యలు: తీవ్రమైన హెపటైటిస్‌, పిత్తాశయంలో రాళ్ళు, సిరోసిస్‌.

జీర్ణాశయ సమస్యలు: మలబద్ధకం, ఊబకాయం, చక్కెర వ్యాధి

ఊపిరితిత్తులు: బ్రాంకైటిస్‌, ఎంఫిసీమా, ఆయాసం వంటి సమస్యలు.

కీళ్ళు: రుమెటాయిడ్‌ ఆర్థరైటిస్‌, ఆస్టియో ఆర్థరైటిస్‌, స్పాండిలైటిస్‌, ఆస్టియో పొరాసిస్‌, సొరియాటిక్‌ ఆర్థరైటిస్‌ వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది.

మూత్రవాహిక: పురుషులలో ప్రోస్ట్రేట్‌ గ్రంధి పెరగడం, నెఫ్రైటిస్‌, చక్కెర వ్యాధి వల్ల రీనల్‌ సమస్యలు రావడం వంటి పలు సమస్యలు వస్తాయి.

చర్మం, కండరాలు: సొరియాసిస్‌, హెర్పిస్‌, డెర్మటోసెస్‌, జుట్టు, గోళ్ళ వ్యాధులు, మోటార్‌ న్యూరాన్‌ వ్యాధివల్ల సంక్రమించే రోగాలు ఉంటాయి.

వినాళగ్రంధి (ఎండోక్రైన్‌ గ్లాండ్స్‌): హైపో, హైపర్‌ థైరాయిడిజమ్‌, నపుంశకత్వం, స్ర్తీ, పురుషులలో మెనోపాజ్‌ సిండ్రోమ్‌ తదితర సమస్యలు.

ఇంద్రియాలు : చత్వారం, గ్లకోమా, పాక్షిక లేదా పూర్తి చెవుడు, మెనీర్స్‌ సిండ్రోమ్‌, వెర్టిగో వంటివి సంభవిస్తాయి.

సులువైన చర్యల ద్వారా వృద్ధాప్యాన్ని, దానికి సంబంధించిన వ్యాధులను నిరోధిం చడం సాధ్యమని ఆయుర్వేదం చెప్తుంది. సరళమైన, నిరాడంబర జీవనమే దాని రహస్యం. ఆయుర్వేదం ప్రకారం ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యాలే వ్యాధిరహిత జీవితాన్ని గడిపేందుకు మూలమైన స్తంభాలు. మితాహారం శరీర జీవసంబంధ ప్రక్రియను క్రమబద్ధం చేస్తుంది.

మితాహారం, నిరాడంబర జీవనశైలే వ్యాధి రహిత సుదీర్ఘ జీవితానికి మంత్రం. జీవనశైలి విషయంలో చేయాల్సినవి, చేయకూడనివి ఆయుర్వేదంలో నిర్దిష్టంగా పేర్కొన్నారు. అది ఒక ప్రత్యేకశాఖగా ఉంది.సంపూర్ణాహారాన్ని తీసుకొని, క్రమబద్ధమైన జీవితాన్ని గడుపుతూ తన మాటలలో, చేతలలో సమతులంగా ఉంటూ, కోరరానివి కోరకుండా, నిజాయితీగా, క్షమాబుద్ధితో పెద్దల ఎడల గౌరవంతో జీవించే వారికి ఎటువంటి వ్యాధులు సంక్రమించవు. పంచకర్మతో పాటుగా జీవన శైలిలో మార్పులతో పాటు అనేక ఆయుర్వేద మందుల తయారీని ఆయుర్వేద గ్రంథాలు వివరిస్తాయి.

వృద్ధాప్య సంరక్షణలో ఉపయోగపడే మొక్కలు:
ఆముదం: ఆముదం విరేచనకారి అని అందరికీ తెలుసు.అయితే వృద్ధాప్య సమస్యలను నిరోధించడం, చికిత్స చేయడంలో ఈ మొక్కకున్న ఉపయోగాలు కొద్ది మందికే తెలుసు.

ఆముదం వేరును నాలుగు భాగాల నీళ్ళలో అది ఒక వంతు వచ్చే వరకు మరిగించి రోజూ తీసుకుంటే వృద్ధాప్యంలో వచ్చే వాత సంబంధ వ్యాధులను నిరోధించవచ్చు.
8-10 ఆముదం గింజలను పొట్టుతీసి 200 మిల్లీలీటర్ల పాలు, 50 గ్రాముల బెల్లం వేసి మరిగించి, ప్రతి రోజూ సాయంత్రం ఈ పాయసాన్ని తీసుకుంటే వృద్ధాప్య సంబంధమైన ఆర్థరైటిస్‌ సమస్యలను నివారించవచ్చు.
గోధుమపిండిలో స్వచ్ఛమైన ఆముదాన్ని కలిపి చపాతీలు చేసుకొని తింటే డయాబెటిస్‌, ఆర్థరైటిస్‌ సమస్యలే కాక మలబద్ధకం కూడా తగ్గుతుంది.
తామరపువ్వు: వృద్ధులకు అత్యంత ఉత్తమమైన టానిక్‌ ఇది. అనేక ప్రాంతాలలో ప్రజలు అందుకే తామర కాడలను కూరలాగా చేసుకుంటారు. తామరాకును విస్తరిగా ఉపయోగిస్తారు. ఇది కణాలను సంరక్షిస్తుందని జపాన్‌లో చేసిన పరిశోధనలలో రుజువైంది. తామర రేకులు కొలస్ట్రాల్‌ను తగ్గించడమే కాక గుండె, మెదడుకు రక్తప్రసరణను మెరుగు పరుస్తాయి.

ఏలక్కాయి: వృద్ధాప్య సమస్యలకు సంబంధించిన అన్ని ఆయుర్వేద మందులలో దీనిని సాధారణంగా ఉపయోగిస్తారు. ఇది మంచి ఆంటాసిడే కాక వాయుహరి కూడా. జీర్ణక్రియను పెంచడమే కాక అసిడిటీ, కళ్ళె వంటి వ్యాధులలో ఉపశమనాన్ని ఇస్తుంది.

ఉసిరికాయ: ఆరోగ్యాన్ని పెంపొందించే, వయసును నిరోధించే మూలిక ఇది. కొలెస్ట్రాల్‌ వల్ల వచ్చే గుండె వ్యాధుల, రక్త ప్రసరణ సమస్యల బారి నుంచి కాపాడుతుంది. చలికాలంలో అవసరమైన కేలరీ డైట్‌ సప్లిమెంట్‌ను అందిస్తుంది.

తులసి: రోగనిరోధక శక్తిని పెంచడమే కాక చలికాలంలో వచ్చే జలుబు, దగ్గులను తగ్గిస్తుంది.

కరక్కాయ: ఆయుర్వేదం ప్రకారం వ్యాధులను, వృద్ధాప్యాన్ని నిరోధించడంలో అత్యున్నతమైన మందు ఇది. కరక్కాయపొడి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇది అన్ని వయసుల వారూ తీసుకోవచ్చు. అలాగే పైల్స్‌ వంటి వ్యాధులను తగ్గించడంలో ఇది గొప్పగా పని చేస్తుంది.

త్రిఫల: ప్రాచీన విజ్ఞానం ప్రకారం ఇది ఉత్తమమైన వయో నిరోధక చికిత్స. అయితే దీనిని వివిధ రుతువుల్లో వివిధ పదార్ధాలతో కలిపి తీసుకోవాలి.

వర్ష రుతువులో – సైంధవ లవణంతో కలిపి
శరత్‌ రుతువు – పంచదారతో కలిపి
హేమంత రుతువు – శొంఠితో కలిపి
శిశిర రుతువులో – పిప్పళ్ళతో కలిపి
వసంత రుతువు – తేనెతో కలిపి
గ్రీష్మ రుతువు – బెల్లంతో కలిపి
తానికాయ: ఇది త్రిఫలాలలో ఒకటి. దీనిని మలబద్ధకం, విపరీతమైన కొలెస్ట్రాల్‌ ఉన్నప్పుడు, లివర్‌, స్ల్పీన్‌ సమస్యల్లోనూ, కంటి వ్యాధులు, బాలనెరుపుకు ఉపయోగిస్తారు.

తిప్ప సత్తు: రోగనిరోధక శక్తిని కాపాడడంలో పెంచడంలో ఇది ప్రముఖమైనది. వాత తత్వం ఉన్నప్పుడు నెయ్యితో కలిపి, పిత్త తత్త్వంలో పటిక బెల్లం, కఫ తత్వం ఉన్నవారు తేనెతో కలిపి తీసుకోవాలి. గౌటీ ఆర్థరైటిస్‌లో ఆముదంతో కలిపి తీసుకోవాలి. మలబద్ధకం ఉన్నప్పుడు బెల్లంతో కలిపి, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఉన్నప్పుడు అల్లం పొడితో కలిపి తీసుకోవాలి.

మండూక పర్ణి: దీనిని మందుగా కన్నా కూడా ఆహారంగా మన దేశంలో ఎక్కువగా తీసుకుంటారు. దీనికి ఒత్తిడిని తగ్గించే, జ్ఞాపక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. అల్జిమీర్స్‌ వంటి వ్యాధులలో ఉపయుక్తం.

అతిమధురం: పిల్లలలో వచ్చే జలుబు(Nose), దగ్గులకు(Asthma) దీనిని చిట్కా వైద్యంగా వాడుతుంటారు. నోటి అల్సర్లకు ఇది మంచి మందు. వృద్ధాప్యంలో శ్వాసకోశ సమస్యలకు మంచి మందని చరకుడు అభిప్రాయపడ్డాడు.

గలిజేరు: ఇది గ్రామాలలో దొరికే మూలిక. దీనిని ఆహారంగా తీసుకోవచ్చు. దీనివేర్లలో పొటాషియం నైట్రేట్‌ అధికంగా ఉంటుంది. మూత్ర నాళ సంబంధ సమస్య, కొన్ని గుండె సంబంధ వ్యాధు చికిత్సలో ఉపయోగపడుతుంది.

పిప్పళ్ళు: ఇది జీర్ణప్రక్రియకు ఉపయోగపడుతుంది. ఆర్థ్రైటిస్‌, మలబద్ధకం వంటి వాటిలో ఉపశమనాన్ని ఇస్తుంది.

జీడి గింజలు: ఇది అత్యుత్తమ పునరుజ్జీవనిగా ఉపయోగపడుతుంది. దీనిలో కాన్సర్‌ నిరోధక శక్తిని ఇటీవలి అధ్యయనాలు వెల్లడించాయి. టిష్యూల నిర్మాణంలో, వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడటం వల్ల దాని గింజలను వృద్ధాప్య సంబంధిత సమస్యలను నివారించేందుకు సూచిస్తారు.

వృద్ధాప్యంలో వచ్చే కీళ్ళ నొప్పులను తగ్గించేందుకు ఇంట్లోనే చేసుకుని వాడదగ్గ కషాయం:
మెంతులు: 100 గ్రా, జీలకర్ర : 50 గ్రా, మిరియాలు – 05 గ్రా మూడింటిని కొద్ది నేతిలో వేయించి పొడి చేసుకొని ఉంచుకోవాలి. ఒక చెంచా పొడిని తీసుకొని ఒక గ్లాసు పాలలో వేసి దానిని కొద్ది సేపు మరగించి రోజుకు ఒకటి రెండు సార్లు తీసుకోవాలి. ఒక వారం రోజులలోనే తేడా కనుపిస్తుంది. ఉపశమనం కలిగే వర కూ ఎన్ని రోజులైనా దీనిని తీసుకోవచ్చు.
#OldagecarewithAyurveda
#Stayhealthywithayurveda
#homeremedies

Follow our Facebook Updates

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *