Home Remedies For Nose Bleeding!

మన ముక్కు ద్వారం నుండి రక్తం బయటకు వచ్చే చర్యను Epistaxis (Nose bleeding)అని అంటారు.మీ ముక్కు లోపల రక్తనాళాలు దెబ్బతిన్న కారణంగా రక్తo  కారడం అనేది జరుగుతుంది .

వేడి ఎక్కువగా ఉన్న శరీరంలో అయితే ఈ  ప్రభావ తీవ్రత అధికంగా కనిపిస్తుంది.ఈ ముక్కు నుండి రక్తం కారడం అనేది , ఇది మనకు హఠాత్తుగా సంభవించే ఒక చర్య.

బీపీ అధికంగా పెరగడం వలనగానీ , ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడం వలనగానీ ,వేడి వాతావరణము వలనగానీ,   ముక్కుదూలం లోపల గాయం అవడంవలన గానీ సాధారణంగా ముక్కులోంచి బడబడా రక్తం కారుతుంది .

ఇలా రక్తం కారిన ప్రతిసారి ఆందోళనపడటం, భయపడటం చేస్తుంటారు. రక్తం కారటాన్ని తగ్గించుకోటానికి ఎన్నో రకాల మందులను ఉపయోగిస్తారు. కానీ కొన్ని సమయాలలో ఎన్ని మందులు వాడినా కూడా అర్థరాత్రి ఆకస్మికముగా ముక్కు నుండి రక్తం కారుతూ ఉంటె చాలా భయం మరియు బాధ కలుగుతాయి .

అటువంటి పరిస్థితులలో ఇంట్లో ఉండే వాటితోనే ఈ పరిస్థితి నుండి బయట పడవచ్చు . సహజ సిద్ధంగా ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే కింది చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

 

Home Remedies For Nose Bleeding
Home Remedies For Nose Bleeding

Home Remedies For Nose Bleeding:

1. ముక్కునుండి రక్తం (Nose Bleeding)బయటకు రాగానే మొదట చేయవలసిన పని ముక్కును చేతివేళ్ళతో నొక్కి పెట్టాలి . మెడను మంచం అంచుకిచేర్చి , తలను వెనక్కు వాల్చాలి . అప్పుడు రక్తం బయటకు పొంగి రాకుండా ఆగుతుంది .

2. ఏ ముక్కు రంధ్రంలోంచి రక్తం (Nose Bleeding)కారుతుందో ఆ వైపున కంటికి కిందుగా ముక్కుదూలం మూలమీద గట్టిగా నొక్కి పెట్టండి . రక్తం కారడం ఆగుతుంది .

3. దానిమ్మపూలను దంచి, రసం తీసి రక్తం కారుతున్న ముక్కులో చుక్కలుగా వేయండి .

4. పచ్చగడ్డి (గరిక ) వేళ్లను శుభ్రంచేసి , కత్తిరించి , మెత్తగా దంచి , ఆ రసాన్ని చుక్కలుగా వేసినా రక్తం ఆగుతుంది .

5. ఇవేమీ దొరక్కపోతే ఎర్ర ఉల్లిపాయలు (నీరుల్లి) దంచి ఆ రసం ముక్కులో వేసినా రక్తం ఆగుతుంది .

6. తరచూ ఇలా రక్తం కారుతూ ఏడిపిస్తున్నప్పుడు శరీరానికి బాగా చలవ కలిగేలా చూసుకుంటూ , వేడిచెయ్యకుండా జాగ్రత్తగా ఉంటే ముక్కులోంచి రక్తం కారడం (Nose Bleeding or EPISTAXIS అంటారు దీన్ని) మాటిమాటికీ జరగకుండా ఉంటుంది!

7. ఉసిరికాయలు పెద్దవి పచ్చడిపెట్టుకొనేవి తెచ్చి, వాటిని మెత్తగా దంచి , ఆ గుజ్జును తలకు పట్టిస్తే మంచి చలవ . రక్తం కారడం ఆగిపోతుంది .

8. బూడిదగుమ్మడి హల్వా చేసుకోవడం , లేత బూడిదగుమ్మడితో కూర , పప్పు వండుకోవడం , బూడిద గుమ్మడిని మెత్తగా దంచితే వచ్చిన నీటిని పంచదార పాకం పట్టుకొని తాగడం – ఇలాంటివి చేస్తే శారీరకంగా చలవకలిగి రక్తస్రావం ఆగుతుంది . ఇది అన్ని శరీరాంగాలలో జరిగే రక్తస్రావాలకు వర్తిస్తుంది .

9. అడ్డసరం పువ్వుల్ని మెత్తగా దంచి, నేతిలో వేయించి , పంచదార పాకం పట్టుకొనిగాని , తేనె కలుపుకొని గానీ ఒకటిరెండు చెంచాల మోతాదులో రెండుపూటలా రోజూ తీసుకుంటే ముక్కులోంచి రక్తం కారడం ఆగుతుంది .

10 . శుభ్రమైన దూది లేక గుడ్డ ముక్కను చల్లని నీళ్ళతో తడిపి కొద్దిగా ముక్కులోనికి చొప్పించి నొక్కి ఉంచవలేను.

11. విటమిన్ ఇ క్యాప్సూల్స్ ను విరగొట్టి అందులో ఉన్న నూనెను ఒక గిన్నెలో పోసుకోవాలి . దీనిని ముక్కు లోపలి భాగంలో రాయాలి . ఇలా రాత్రంతా వదేలేయండి . ముక్కు పొడిబారినట్టు అనిపించినా ప్రతిసారీ ఈ విధంగా రాయండి . చక్కని ఫలితం ఉంటుంది .

పైన చెప్పిన వాటిలో వీలు అయిన పద్దతిని పాటించి Nose Bleeding  ని నియంత్రణలోకి తీసుకురావచ్చు

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *