What are the health benefits of Ragi Malt? ఎదిగే పిల్లలకు ,చదువుకునే పిల్లలకు, గర్భవతులకు ,మరియు పాలిస్తున్న తల్లులకు రాగి మాల్ట్ ఇవ్వడం వల్ల వాళ్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.రాగులు రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా రోగాలు రాకుండా కాపాడుతాయి . శరీరాన్ని రోగాలను ఎదుర్కొనేలా దృఢంగా చెయ్యగల శక్తి రాగులకు మాత్రమే ఉంది.వేడివలన కలిగే వ్యాధుల అరికట్టడానికి రాగులు ఎంతో ఉపయోగకరం.ఇవి చూడడానికి సన్నని ఆవ గింజల్లా ఉంటాయి .
మన తెలుగు వారు రాగులను చోళ్ళు అని వ్యవహరిస్తారు . రాగులని ఏ రూపంలో తీసుకున్నా శరీరానికి బలకరమే. రాగులను రొట్టెలాగా , సంకటి లాగా , అంబలి గాను , జావ గానూ ఏ విధంగా అయినా తీసుకోవచ్చు .
మినుప సున్నుండ ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు .అదే మాదిరిగా మినుమలు బదులు రాగుల పిండితో సున్ని ఉండలు చేసుకు తింటే దేహ పుష్టి కలుగుతుంది .ఈ రాగులతో చేసిన సున్ని ఉండలు చలవ చేయడమే కాకుండా ఎదిగే పిల్లలకు ఇది మంచి పోషకాహారం .
Health Benefits of Ragi Malt:
1)రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంది. 100 గ్రాముల రాగులలో 344 మిల్లీగ్రాముల క్యాల్షియం లభిస్తుంది. ఇది శరీరంలో ఎముకలు, దంతాలకు ఉపయోగపడుతుంది. దంతాలు, ఎముకలు దృఢంగా మారతాయి. కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి. ఎదిగే పిల్లలకు చాలా మేలు చేస్తుంది. రాగులను తీసుకోవడం వల్ల వారిలో ఎముకలు దృఢంగా ఉంటాయి.పాలు మరియు డయిరీ ఉత్పత్తులు పడని వారికి ఇది మంచి ప్రత్యామ్నాయ ఆహరం.
2)రాగులలో కాల్షియమ్ తో పాటు పాస్ఫరస్ అధికంగా ఉండడం వల్ల ఎముకుల నిర్మాణానికి బాగా ఉపయోగపడుతుంది
3)రాగుల గ్లయిసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అంతేకాకుండా రాగుల్లో పాలీఫినాల్స్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మధుమేహాన్ని అదుపు చేస్తాయి.రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి.
4)రాగుల్లో చర్మానికి మేలు చేసే మిథియోనైన్, లైసిన్ వంటి అమైనోయాసిడ్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ముడతలు పడనీయకుండా చూస్తాయి. దీంతో వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు. అలాగే పాడైపోయిన చర్మ కణాలు పునరుత్తేజం పొందుతాయి. దీంతో చర్మంపై మచ్చలు తగ్గిపోతాయి.
5)సూర్యకాంతి ద్వారా లభించే విటమిన్ డి రాగుల్లో కూడా ఉంటుంది. నిత్యం రాగులను ఏదో ఒక రూపంలో తీసుకుంటే విటమిన్ డి లోపం సమస్యను అధిగమించవచ్చు.
6)రక్తహీనత సమస్యతో బాధపడేవారికి రాగులు చక్కని ఔషధం అని చెప్పవచ్చు. వీటిల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో రక్త హీనత సమస్య పోతుంది.డిప్రెషన్, నిద్రలేమి, మానసిక ఒత్తిడి తదితర సమస్యలను నయం చేసే గుణాలు రాగుల్లో ఉన్నాయి. తలనొప్పిని కూడా ఇవి తగ్గిస్తాయి. శరీరానికి ప్రశాంతతను చేకూరుస్తాయి.
7)రాగులను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే బరువు తగ్గవచ్చని వైద్యులు చెబుతున్నారు. వీటిల్లో ఉండే ఫైబర్ కడుపులో ఎక్కువసేపు ఉంటుంది. కనుక అంత త్వరగా ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గవచ్చు.
8)రాగులను నిత్యం ఏదో ఒకవిధంగా తీసుకోవడం వల్ల బీపీ తగ్గుతుంది. గుండె సమస్యలు రావు. జీర్ణ సమస్యలు పోతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
9)రాగులలో ఉండే పీచు పదార్థం రక్తంలో కొలెస్ట్రాల్ నిల్వ ఉండకుండా చేసి గుండె జబ్బులు రాకుండా నిరోధిస్తుంది.
10)రాగి జావ వల్ల వేసవిలో దాహం సమస్య తీరుతుంది. రాగుల్లో ఉండే అయోడిన్ థైరాయిడ్ సమస్యలకు చెక్ పెడుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
రాగి మాల్ట్ తయారు చేసుకొనే విధానం :
మొలకలు ఎత్తిన ధాన్యం పిండిని మాల్ట్ అని పిలుస్తారు . రాగులను మొలకలు ఎత్తించి పిండిని చేస్తే రాగి మాల్ట్ అవుతుంది . రాగులను బాగు చేసి నీళ్లల్లో నాన బెట్టి ఆరు గంటలు నానిన తరువాత గుడ్డలో వేసి మూట కట్టి ఒక పక్కన పెట్టాలి . మధ్యమధ్యలో ఆ మూటను తడుపుతూ ఉండలి . ఒకటి లేదా రెండు రోజుల్లో చిన్నచిన్న మొలకలు వస్తాయి . మొలకలు వచ్చిన వాటిని ఎండలో ఆరబెట్టి దోరగా వేయించాలి . అలా వేగిన రాగులను మరపట్టిస్తే వచ్చేదే రాగిమాల్ట్ .
ఈ రాగి మాల్ట్ ను ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుందాం!(Health benefits of Ragi Malt)
రాగి మాల్ట్ ని పాలలో గాని, మజ్జిగలో గాని ,కలుపుకొని త్రాగవచ్చు . రాగి మాల్ట్ తో రొట్టెలు , పరోటాలు వంటివి కూడా చేసుకోవచ్చు .
జీడిపప్పు , బాదం పప్పు , పిస్తా పప్పుల పౌడర్ తయారు చేసి రాగి మాల్ట్ లో కలిపి పిల్లలకు ,గర్భవతులకు ఇవ్వడం వల్ల వారిలోని శక్తిని పెంపొందించిన వారు అవుతారు .
కడుపులో మంట , ఎసిడిటీ , కడుపులో నొప్పితో బాధపడుతున్నవారు రాగిమాల్ట్ ను చిక్కని జావలా కాచుకొని అందులో మజ్జిగ కలుపుకొని త్రాగడం వల్ల ఈ బాధ నుండి ఉపశమనం పొందుతారు .
పెప్టిక్ అల్సర్ తో బాధపడుతున్నవారు పైన చెప్పిన విధంగా రెండు పూటలా సేవిస్తే అతి తక్కువ సమయంలోనే అద్భుత ఫలితాలను చూస్తారు .
బీపీ మరియు షుగర్ వ్యాధులతో బాధపడే వారు రాగి మాల్ట్ ను సాధ్యమైనంత ఎక్కువ సార్లు తీసుకోవడం వల్ల ఒంట్లో ఉన్న వేడిని తగ్గించడమే కాకుండా బిపి పెరగకుండా కాపాడమే కాక షుగర్ లెవెల్స్ నియంత్రణలోకి రావడానికి దోహద పడుతుంది .
0 Comments