#Acidity – Home Remedies #అసిడిటీ – గృహచికత్సలు

మీరు కొంచెం ఆహారం తీసుకుంటున్నా కడుపు ఉబ్బరంగా ఉండడం, ఛాతి పై భాగంలో మరియు కడుపులో మంట, పుల్లని త్రేనుపులు వంటి లక్షణాలతో భాధపడుతున్నారా?

ఈ లక్షణాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటే పెద్ద సమస్య కాదు కానీ తరుచుగా కనిపిస్తుంటే మాత్రం దాన్ని అసిడిటీ గా పరిగణించవచ్చు.

యుక్త వయస్కులనుంచి వృద్ధులు దాకా అందరిని ఎప్పుడో ఒకసారి ఇబ్బంది పెట్టే సమస్య అసిడిటీ.

ప్రపంచ వ్యాప్తంగా 32 నుంచి 40 శాతం మందిని ఈ సమస్య వేదిస్తున్నట్లుగా ఒక అంచనా.

అసలు అసిడిటీ ఎందుకు వస్తుంది ?

జీర్ణాశయంలో జీర్ణక్రియకు ఉపకరించే హైడ్రోక్లోరిక్ ఆసిడ్ (Hydrochloric acid) అనే ఆమ్లము అధిక మొత్తంలో విడుదల అయినప్పుడు అసిడిటీ వస్తుంది.

మనం తీసుకున్న ఆహారం గొంతునుంచి అన్నవాహిక ద్వారా జీర్ణాశయంలోకి వెళ్తుంది. ఈ ఆహారం జీర్ణాశయంలో విడుదల అయ్యే ఆమ్లంతో కలిసి అన్నవాహికలోకి పైకి తన్నకుండా, అన్నవాహిక క్రిందభాగాన ఉండే sphincter కండరం గట్టిగా ( lower oesophageal sphincter) మూసుకొని ఉండి అడ్డుకుంటుంది.

ఈ sphincter కండరం పని తీరు సరిగ్గా లేక వదులు అయినప్పుడు ఆహారం మరియు ఆమ్లం రెండూ కలిసిపోయి మనం తీసుకున్న ఆహారం అన్నవాహిక ద్వారా పైకి తన్నుతుంది.

జీర్ణాశయంలో ఆమ్లం ( హైడ్రోక్లోరిక్ ఆసిడ్ ) అధికంగా ఉత్పత్తి కావటానికి, అన్నవాహిక కవాటం సరిగా పనిచేయడానికి అనేక కారణాలు ఉంటాయి. ఆ కారణాలు మనిషికో విధంగా ఉండొచ్చు.

అసిడిటీకి కారణాలు:

**మసాలాలు, కారం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం

**సమయం సందర్భం లేకుండా తినడం

**మద్యపానం

**కాఫీ మరియు కొన్ని రకాల శీతల పానీయాలు

** నిమ్మ, నారింజ వంటి పుల్లటి పండ్లు, చింతపండు,టమాటా, వెనిగర్,chocolates, మిరపకాయలు లాంటివి ఎక్కువగా తినడం

**స్థూలకాయం

** తీవ్రమైన మానసిక ఒత్తిడి

**బిగువైన దుస్తులు ధరించడం

**భుక్తాయాసం వచ్చేట్లు ఎక్కువగా తినడం

అసిడిటీ వల్ల కలిగే పరిణామాలు:

అసిడిటీని నిర్లక్ష్యం చేసి ఎటువంటి చికత్స తీసుకోకుండా వదిలేస్తే కాలక్రమేనా అన్నవాహికకు పూత (oesophagitis), అన్నవాహికలో పుళ్ళు ( oesophageal ulcers), అన్నవాహిక సన్నగా కావడం ( oesophageal stricture) లాంటి సమస్యలతో పాటు అన్నవాహిక క్యాన్సర్ కు దారితీసే బ్యారేట్స్ ఈసోఫేగస్ (Barret’s Esophagus) కూడా రావచ్చు.

అసిడిటీ – ఆయుర్వేదం:

ఆయుర్వేదం ప్రకారంగా అసిడిటీని ఆమ్ల పిత్త అని అంటారు. ఆమ్ల పిత్తం అనేది పిత్త దోష ప్రకోపం వల్ల వస్తుంది. ఈ ప్రకోపం చెందిన పిత్త దోషం జీర్ణ వ్యవస్థను దెబ్బ తీసి, తీసుకున్న ఆహారాన్ని జీర్ణం కాకుండా చెయ్యడం వల్ల ఆమ(Toxins)దోషం ఉత్పత్తి అవుతుంది.

ఈ ఆమ దోషం జీర్ణవ్యవస్థలో కి ప్రసరించి అక్కడ నాళాలలో పేరుకుపోవడము వలన ఆమ్లపిత్తము కి దారితీస్తుంది.

చికిత్సా విధానము:

ప్రకోపము చెందిన పిత్త దోషముని శాంతింప చేసి,శరీరములో పేరుకుపోయిన ఆమ దోషముని పంచకర్మ పద్దతులు మరియు కడుపులోకి తీసుకునే మందుల ద్వారా బయటకు పంపి శరీరాన్ని శుద్ధి చేస్తాయి.

దీని మూలముగా జీర్ణక్రియ పెరిగి శరీర క్రియలు సక్రమముగా అవుతాయి.

అందరికి వచ్చే సందేహము- పిత్త దోషము అంటే వేడి అలాగే ఆయుర్వేద మందులు కూడా వేడి అస్సలు ఆయుర్వేద మందులు ఎలా పని చేస్తాయి??

ఆయుర్వేదములో వేడి చేసే మందులు మరియు చలువ చేసే మందులూ ఉంటాయి.

రోగి శరీర తత్త్వం బట్టి రోగ లక్షణాలను ఆదారముగా చికిత్స చెయ్యడము జరుగుతుంది.

గృహ చికత్సలు :

**20 గ్రాముల సోంపును ఒక లీటర్ నీటిలో వేసి రుచికి తగినంత బెల్లం వేసి ముప్పావు లీటర్ అయ్యే వరకు మరిగించాలి. దీన్ని రోజు మొత్తంలో అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా తీసుకోవాలి.

**జీలకర్రని బాగా వేయించి పొడి చేసుకొని ఉంచాలి, (1/2 ) అరటీ స్పూన్ పొడిని ఒక లీటర్ నీళ్ళలో పది నిముషాల పాటు మరిగించి ఆ నీటిని రోజంతా తాగాలి. ఏ రోజు కషాయాన్ని ఆ రోజే తయారు చేసుకోవాలి.

**ఒక లీటర్ మజ్జిగ లో చిటికెడు జీలకర్ర పొడి మరియు చిటికెడు వాము పొడి వేసుకొని సేవించవలెను.

**వేపుడు పదార్దాలు తగ్గించాలి.

#AmrithaAyurvedamPanchakarmaHopsital
#DrBheesettiSanthisree
#Vishakhapatnam #acidity #homeremedies #gastritis

Follow Facebook

Open chat
1
Hi!
How Can I Help You?