Preservatives and Its Negative Effects on Safe Lifestyle #7 - Autism Ayurvedam

Preservatives and Its Negative Effects on Safe Lifestyle #7

by | Aug 28, 2019 | Ayurvedam Treatment, Home Remedies

Preservatives and Its Negative Effects on Safe Lifestyle

నిల్వ ఆహారంతో అగచాట్లు : జీవకోటిలో అసంఖ్యాక రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి . వీటిలో ప్రధానమైనవి వైరస్ , బాక్టీరియా , శిలీoద్రాలు (బూజు రకాలు ). ఇవేవి ప్రకృతిపరంగా తమంతట తాము ఆహారాన్ని తయారుచేసుకోలేవు . మన ఆహారం మీదనే ఉంటూ తమ ఆకలిని తీర్చుకుంటూ , తమ వంశాలను వృద్ది చేసుకుంటున్నాయి. ఆహార పదార్దాల మీద వాలేటప్పుడు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ ఆ తర్వాత సంతానాన్ని వృద్ధి చేస్తాయి . వాలిన ఆహారపదార్థం అనుకూలంగా మారేంతవరకూ భుజించి , ఆ తర్వాత తామరతంపరగా వృద్ధి పొందుతున్నాయి . ఆహారం చీకటిలో ఉండి , అందులో ద్రవస్థాయి ఉంటే చాలు , కొద్దిసేపటికే సూక్ష్మజీవుల రాజ్యం ఏర్పడుతుంది . ఇవి ఆహార పదార్దాలను అతిసూక్ష్మంగా విడదీసే ప్రయత్నంలో ఉత్పత్తి అయ్యే వాయువుల ద్వారా దుర్వాసన బయలుదేరుతుంది . ఆహారం మొత్తం కలుషితమవుతుంది . దానినే మనం తింటే అనారోగ్యం ప్రాప్తిస్తుంది .
సూక్ష్మజీవులైన బాక్టీరియాలు , ఈస్ట్ లు , శిలీoద్రాలు, కీటకాల వలన ఎంజైముల చర్య వలన ఆహారపదార్దాలు సాధారణంగా చెడిపోతాయి . అన్ని జీవపదార్దాలలోనూ ఎంజైములుంటాయి . బాగా వేడి చెయ్యడం వలన ఇవి తమ ఉనికిని కోల్పోతాయి . అదుపు చేసిన  కొన్ని పరిస్థితులలో కొన్ని సూక్ష్మజీవులను ఉపయోగించి ఆహారపదార్దాలలో వాంఛనీయమైన మార్పును పొందవచ్చు . పాల నుండి పెరుగు తయారు కావడం దీనికి చక్కని ఉదాహరణ . జీవకణాలు ఉత్పత్తి చేసే కర్బన ఉత్ప్రేరకాలనే ఎంజైములంటారు . ఇవి ప్రోటీనులు కాబట్టి వేడి చేసినప్పుడు వాటి స్వభావాన్ని కోల్పోయి చర్యరహితములవుతాయి . ఆహారపదార్దాల నిలవలో జరిగే మార్పులకు కారణం ఆయా పదార్దాలలో గల ఎంజైములు , లేదా ఆ ఆహారపదార్దాలలోని సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసిన ఎంజైములే! వీటి చర్యా వేగం ఉష్ణోగ్రతను బట్టి మారుతూ ఉంటుంది . 80 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దాటితే ఎంజైములు చెడిపోతాయి . సూక్ష్మజీవులను నిర్జీవపరచడం , సూక్ష్మజీవుల పెరుగుదలను ప్రత్యుత్పత్తిని అరికట్టడం , సూక్ష్మజీవులను తొలగించడం మొదలైన పద్దతుల ద్వారా ఆహారపదార్దాలను నిలువ చెయ్యవచ్చు . ప్రకృతిలోనే సహజ సిద్ధంగా సూక్ష్మజీవుల ప్రవేశాన్ని నివారించటానికి వివిధ రకాల అమరికలు కనిపిస్తాయి . నిమ్మ , నారింజ , అరటిఫలాల పైన తొక్కలు, ఆల్మండ్, వాల్ నాట్ మొదలైన కాయల గట్టి కవచం; చేపలు , మాంసంపై ఉండే కొవ్వు లేదా చర్మం సూక్ష్మజీవుల ప్రవేశాన్ని నిరోధిస్తాయి . ఆహారపదార్దాలను డబ్బాలలో ఉంచి సీల్ చెయ్యడం ద్వారా కూడా సూక్ష్మజీవుల ప్రవేశాన్ని నిరోధించవచ్చు .
ఆహారపదార్దాలను నిలువ చేసే పద్ధతులు వివిధ రకాలు . అందులో మొదటిది డిహైడ్రేషన్ , సూక్ష్మ తేమను తొలగించి నీటిగాఢతను ఎండబెట్టడం ద్వారా లేదా ఈ ఆహార పదార్దాలకు చక్కెర లేదా ఉప్పును కలపడం ద్వారా సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించవచ్చు .
నిల్వ ‘ఎన్వీ ‘ తో క్యాన్సర్ ! : 
  మాంసాహారాన్ని నిల్వ ఉంచేందుకు సోడియం నైట్రేట్ అనే రసాయనాన్ని కలుపుతారు . అయితే   ఈ నైట్రేట్ ల చర్య కారణంగా జన్యుపరివర్తన సంభవించి , అది పెద్దపేగు (కొలోన్ ) క్యాన్సర్ కు దారి తీసే ప్రమాదం లేకపోలేదని పరిశోధకులు అంటున్నారు . నైట్రేట్ లు చల్లి నిల్వ ఉంచిన మాంసాహారంతో తయారైన ‘హాట్ డాగ్స్ ‘ ని పరీక్షించిన అనంతరం వారీ నిర్దారణకు వచ్చారు .వేయించిన ఉల్లిపాయలను మాంసపు చుట్టలలో చుట్టి ఉడికించే వంటకమే ఈ హాట్ డాగ్స్.  అమెరికన్లు వీటిని విపరీతంగా ఆరగిస్తారు. పరిశోధకులు స్వచ్ఛమైన నీటిని ఉపయోగించి హాట్ డాగ్స్ లోని సమ్మిళితాలను సంగ్రహించినప్పుడు ‘ఎన్ . నైట్రోసా ‘ అనే మిశ్రమం బయటపడింది . ఈ మిశ్రమాన్ని వారు ఆహారపదార్దాలలో నివాసముండే సాల్మానెల్లా బాక్టీరియాతో చర్య జరిపించగా క్యాన్సర్ కు కారణమయ్యే జన్యుపరివర్తన సంభవించింది . క్యాన్సర్ కారకాలను కార్సినోజెనిక్స్ అంటారు. ”ఎన్. నైట్రోసోలలో చాలా వరకూ కార్సినో జెనిక్ లే . వీటివలన మానవదేహంలోని వివిధ అవయవాలలో క్యాన్సర్ వృద్ధి చెందే అవకాశం ఉంది”. అని ఈ పరిశోధకబృందానికి నాయకత్వం వహించిన ఐర్లండ్ ప్రొఫెసర్ మాధ్యులిక్స్ వెల్లడించారు . మాంసాహారులిక కాస్త చూసి తినడం అలవాటు చేసుకోవాలి .

ఎంతకాలం నిలవ ఉండవచ్చు ? : దైనందిన జీవితంలో ప్రత్యేకించి ఆహారపదార్దాలను భద్రం చేసే విషయంలో తగిన జాగ్రత్తలను పాటించక ఎందరో అనారోగ్యం బారిన పడుతుంటారు . అవగాహన లేమితో కాలం చెల్లిన పదార్దాలను ఆహారంగా గ్రహిస్తూ వ్యాధిగ్రస్తులవుతుంటారు . ఈ నేపథ్యంలో నిత్యం మనం ఉపయోగించే కొన్ని ఆహార పదార్దాలు అసలెంతకాలం నిలవ ఉండవచ్చో తెలుసుకోవడం మంచిదే కదా .

డబ్బాలలో ఉండే ఆహారపదార్దాలు : ఉష్ణ వాతావరణంలో ఈ తరహా ఆహారం రెండు నుంచి ఐదేళ్ళ వరకు భద్రంగా ఉండే అవకాశముంది . అయితే ఎక్స్ ఫైరీ డేట్ (పదార్థం, పాడైపోయే తేదీ )కు ముందే దానిని ఉపయోగించడం అన్ని విధాల ఆరోగ్యం. వాతావరణంలో తలెత్తే తేడాలు – ఈ డబ్బాలు తుప్పు పట్టడానికి , అందులో ఆహారం చెడిపోవడానికి కారణం కావచ్చు . ఈ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి .

పిండిపదార్దాలు : శుద్ధిచేసిన పిండిపదార్దాలు ఎక్కువకాలం నిలవవుంటాయి. మూడు నుంచి ఆరు మాసాల వ్యవధి వరకు వీటిని ఉపయోగించుకోవచ్చు . అదే మామూలు పిండి పదార్దాలైతే మూడు నెలలలోగానే వాటిని వాడెయ్యడం క్షేమదాయకం .

తృణధాన్యాలు : గాలి చొరబడని గదులలో , ప్రదేశాలలో భద్రపరచడం ద్వారా వీటిని ఆరు మాసాలవరకు నిలవ చెయ్యవచ్చు . అయితే వాతావరణంలో మార్పులు ఈ ధాన్యవిశేషాలను మెత్తబరచి , రంగు మారేలా చేస్తాయని గ్రహించాలి .

పప్పు/ గింజ ధాన్యాలు : శుద్ధి చేసినట్లయితే ఇవి సంవత్సర కాలంపాటు నిలవవుంటాయి. వంటకు ఉపయోగపడే ముందు వీటిని శుభ్రపరచడం అవసరం .

మసాలా దినుసులు : వీటిని ఆరుమాసాల నుంచి ఏడాది వ్యవధి వరకు నిలవ చెయ్యవచ్చు . యాలకులు , లవంగాలు తదితర సుగంధ ద్రవ్యాలను కొద్ది మొత్తంలోనే కొనుగోలు చేసి భద్రపరచడం ఉత్తమం . ఈ దినుసులను సువాసన కోల్పోకముందే ఉపయోగించడం ఆరోగ్యకరం .

ఆహారపదార్దాలకు రుచినిచ్చే లవణాలు , పొడులు :  వెనిగర్ తో కలిసుండే ఈ రకం లవణాలు , పొడులకు ఏడాదిపాటు నిలవ ఉండే సామర్ధ్యం కలిపిస్తుంది .
పండ్లు , కూరగాయలు నిల్వ చేసుకునే పద్ధతులు : చాలామంది గృహిణులు పండ్లు , కూరగాయలు ఫ్రిజ్ లోకి తోసేస్తారు . తప్ప ఓ పద్దతిగా సర్దుకోరు . మామిడిపండ్లు , యాపిల్స్ , చెర్రీ పండ్లు , ద్రాక్ష వంటివి ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉంచి ఫ్రిజ్ లో పెట్టాలి . అవసరమైతే ఈ బ్యాగ్స్ కు ఓ గుండుసూదితో చిన్న చిన్న రంధ్రాలు  చేసుకోవచ్చు .
పండ్లను ముందు ఉప్పు కలిపిన నీటితో కడిగితే వాటిమీద ఉన్న సూక్ష్మజీవులన్నీ తొలగించవచ్చు . ఆ తరువాత తడిపోయేదాకా ఆరబెట్టి అనంతరం ఫ్రిజ్ లో సర్దుకోవాలి . నేరేడుపండ్లు , రేగిపండ్ల వంటివి కడగకుండానే భద్రపరచాలి .
అరటిపండ్లు , పైనాపిల్ వంటివి ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేదు . క్యాబేజీ , క్యాలీఫ్లవర్ , బఠాణీల వంటివి ఫ్రిజ్ లో పెట్టేముందు ప్లాస్టిక్ బ్యాగ్స్ లో ఉంచాలి . టమాటాలు ముందుగా బాగా కడిగి , తుడిచాక మాత్రమే ఫ్రిజ్ లో ఉంచాలి . బెండకాయలు , దోసకాయలను ఫ్రిజ్ లో సర్దుకునే ముందు కడగండి . శుభ్రమైన బట్టతో తుడిస్తే సరిపోతుంది .
వంకాయలు , కాకరకాయలు , ముల్లంగి , చిలకడదుంపలు , క్యారెట్లు , బీట్ రూట్లు , ప్లాస్టిక్ బ్యాగ్స్ లో పెట్టకుండా డైరెక్టుగా ఫ్రిజ్ లో సర్దాలి . ఆకుకూరల విషయానికి వస్తే ముందుగా వేళ్ళు కత్తిరించి , కడిగి ఆరబెట్టి ఫ్రిజ్ లో సర్దాలి . ఒక్కరోజు కన్నా ఆకుకూరలు ఫ్రిజ్ లో అయినా సరే ఉండవు . వీలైనంతవరకు కొన్న రోజే వీటిని వండేయాలి . ఇకపోతే చికెన్ , మటన్ వంటివి స్టోర్ చేసేముందు శుభ్రంగా కడగాలి . బ్రెడ్ , కేక్స్ , పేస్త్రీల వంటివి వ్యాక్స్ పేపర్ లో భద్రపరచి ఫ్రిజ్ లో పెట్టాలి .
పై విధంగా సర్దుకుంటే త్వరగా పాడవ్వకుండా ఉంటాయి .
కోడిగుడ్డును ఎలా జాగ్రత్తపరచాలో చూద్దాం .. : మార్కెట్ నుంచి తేగానే ఫ్రిజ్ లో పెట్టాలి . ఫ్రిజ్ లో పెట్టేముందు గుడ్లను కడగొద్దు . కడగడం వలన గుడ్లు పెంకు చుట్టూ సహజసిద్దంగా ఉండే రక్షణపొర పోతుంది . ఫ్రిజ్ లో పెట్టిన కోడిగుడ్లు రెండు మూడు వారాల పాటు పాడుకావు . గుడ్లు పెంకుపై కొన్ని వేల రంధ్రాలు ఉంటాయి . అందుకని కోడిగుడ్లను ఘాటైన వాసనలు ఉండే పదార్దాలుకూ దూరంగా పెట్టాలి .

ఎన్నో రకాల కంటెయినర్లు .. : ఎప్పుడో ప్రొద్దుననగా ఆఫీస్ కు బయలుదేరుతాం . మధ్యాహ్నం దాకా పదార్దాల పోషకవిలువలు కోల్పోకుండా కాపాడుకోవడం ఎలా అనే సందేహం రావచ్చు . మజ్జిగ , ఫ్రూట్ జ్యూస్ , సూప్ లాంటివి పెట్టుకోవడానికి తాజాదనం కోల్పోకుండా చూసే ప్రత్యేక లక్షణాలున్న కంటెయినర్లు , టిఫిను క్యారియర్లు ఎన్నో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి . అలాంటివాటిని ఎంపిక చేసుకోండి .

కూరగాయలు భద్రపరచుకోవడానికి ఫ్రిజ్ లేనివారు ఏం చెయ్యాలంటే ..: మూతఉన్న వెడల్పాటి డబ్బా ఒకటి తీసుకొని దాని అడుగున భాగాన ఉప్పు వెయ్యండి . ఇప్పుడు ఆ డబ్బాలో నిమ్మకాయలు వేసుకోవచ్చు . తాజాగా ఉండడమే కాదు రసం కూడా ఎక్కువగా వస్తుంది . లేదంటే ఓ పాత్రలో నీళ్ళు పోసి అందులో నిమ్మకాయలు వెయ్యాలి . అయితే రోజూ ఆ నీటిని మారుస్తూ ఉండాలి . వడిలిపోయినట్లున్న టమాటాలను కూడా ఉప్పు నీటిలో కొద్దిసేపు ఉంచితే తాజాగా ఉంటాయి .

Book an appointment with us. We are just a Phone call away, Let us Talk.

Phone no : +91 9989759719

0 Comments

Submit a Comment

Your email address will not be published. Required fields are marked *

Dr. Santhisree Bheesetti

Driven by her passion, she has cultivated a profound understanding of complex conditions like Autism, ADHD, Cerebral Palsy, Down Syndrome, Speech disorders, and Anxiety disorders, alongside her specialization in Women’s issues and Neurological disorders in adults.
Why Brain Nutrient Utilization Matters for Child Development

Why Brain Nutrient Utilization Matters for Child Development

Neurodevelopmental conditions such as autism, speech delay, attention difficulties, and sensory dysregulation are increasingly understood to involve functional nutrient utilization challenges, particularly in folate-dependent brain pathways.

Gut Clear Oil – Ayurvedic Gut & Brain Health Support for Autism, ADHD, and Speech Delay

Gut Clear Oil – Ayurvedic Gut & Brain Health Support for Autism, ADHD, and Speech Delay

Did you know your gut and brain are deeply connected? Research and Ayurveda both highlight that gut health plays a crucial role in brain function, behavior, and cognitive development. Children with Autism, ADHD, and Speech Delay often struggle with digestive issues like constipation, bloating, and poor nutrient absorption. These gut imbalances can impact their mood, focus, and ability to communicate.

Ready to Restore Harmony in Your Mind, Body, and Spirit

Our Treatments

Panchakarma

Shiro Abhyanga

Nasya Karma

Takradhara

Vasti Benefits