Mushrooms – Extraordinary Nutrients and Positive Benefits

పుట్టగొడుగులు :

పుట్టగొడుగులు అంటే సాధారణంగా చాలామందికి ఇష్టం ఉంటుంది. వీటితో పలు రకాల వంటలు కూడా చేసుకుని చాలా మంది తింటుంటారు. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా వీటిని తీసుకోవచ్చు. ఆకుకూరలు తినలేని వారు పుట్టగొడుగులను తింటే అంతే స్థాయిలో పోషకాలు శరీరానికి అందుతాయి.

వారానికి కనీసం రెండు సార్లయినా వీటిని తినడం వలన శరీరానికి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయి. మాంసకృత్తులకు మేలైన ప్రత్యామ్యాయంగా ఉన్న వీటిలో తినడానికి ఉపయోగపడేవి కొన్ని మాత్రమే . బటన్ మష్రూమ్స్ , ప్యాడే స్ట్రా , (ఆల్చిప్ప) వెరైటీలు మాత్రమే వినియోగించాలి . బజారులో ఓయెస్టర్ తాజావైన మష్రూమ్స్ ను తీసుకొనే సందర్భంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాడకంలో కూడా శుభ్రం చెయ్యడం, ఉప్పు నీటిలో ఉడికించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి .

వందగ్రాముల తాజా పుట్టగొడుగుల్లో పోషకవిలువలు ఈ విధంగా ఉన్నాయని ‘న్యూట్రిటివ్ వాల్యూ ఆఫ్ ఇండియన్ ఫుడ్స్ ‘, ఎన్ . ఐ . ఎన్ .,(హైదరాబాద్ ) వారు తెలిపారు . తేమ – 88. 5 గ్రా ., కార్బోహైడ్రేట్ లు -4. 3 గ్రా ., ప్రోటీన్ – 3. 1 గ్రా ., ఫైబర్ – 0. 4 గ్రా ., శక్తి – 43 కిలో క్యాలరీలు , ఫ్యాట్ -0. 8 గ్రా ., ఖనిజ లవణాలు – 1. 4 గ్రా ., కాల్షియం – 6 మిల్లీగ్రాములు , పొటాషియం – 320 మిల్లీగ్రాములు , మెగ్నీషియం -9 మిల్లీగ్రాములు, సోడియం – 5 మిల్లీగ్రాములు , ఐరన్ – 1.5 మిల్లీగ్రాములు , రిబోఫ్లేవిన్ – 0. 3 మిల్లీగ్రాములు , థయామిన్ – 0. 09 మిల్లీగ్రాములు .

మాంసకృత్తులు అధికంగా ఉండటంతో తొందరగా జీర్ణమయ్యేందుకు కారణమవుతుంది . పుట్టగొడుగులు తరచూ తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే నిత్యం డైట్‌లో పుట్టగొడుగులు ఉండేటట్లు చూసుకుంటే మంచిది. ప్రోటీన్స్ సమృద్ధిగా ఉండటంతో స్థూలకాయులు మాంసమునకు బదులుగా వీటిని తీసుకుంటే బరువు పెరగరు. శరీరంలో నీరు అధికంగా చేరినవారు, హృద్రోగులు, మూత్రనాళాల్లో రాళ్ళున్నవారికి ఇవి మంచి చేస్తాయి.

ప్రధానంగా మాంసకృత్తుల లోపం ఉన్న వారు తీసుకోవాలి . శరీర దుర్బలతగల వారు వీటికి పంచదార , పాలు కలిపి ఉడకబెట్టి తింటే ఫలితం ఉంటుంది . పుట్టగొడుగుల్లో మన శరీరానికి మంచి చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణాశయంలో ఉండే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. జీర్ణ సమస్యలను పోగొడుతుంది.పుట్టగొడుగుల్లో చాలా రకాలు ఉంటాయి. వీటిల్లో తినదగినవి, తినకూడనివి కూడా ఉంటాయి. బాగా ఎండినవి , ఎరుపు/నలుపు రంగుల్లో ఉండేవి అనారోగ్యం కలిగిస్తాయి. పెద్ద సైజువి, దళసరివి, బరువు లేనివి, మెరుస్తూ ఉండేవి, విరిస్తే నీలిరంగులో కనిపించేవి కూడా అన్నీ మంచివి కావు.

1. పుట్టగొడుగులను తినడం వల్ల గుండెజబ్బులు, క్యాన్సర్, స్థూలకాయం, ఫ్లూ, జలుబు వంటివన్నీ తగ్గుతాయి.

2. పుట్టగొడుగుల నుంచి లభించే పాలీసాకరైడ్స్ వల్ల స్థూలకాయులు బరువు తగ్గే అవకాశం ఉంది. అయితే వీళ్ళు వీటిని రోజూ తీసుకోవలసి ఉంటుంది.

3. రోజూ మష్రూమ్స్ తగినంతగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది . ఇందుకు కారణం పుట్టగొడుగుల నుంచి లభించే లెంటినాన్. అంతేకాదు ఇవి గుండెజబ్బులు రాకుండా నిరోధిస్తాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి కూడా.

4. పుట్టగొడుగులు తినడం ద్వారా బ్రెస్ట్, లివర్ క్యాన్సర్లు రాకుండా నిరోధించవచ్చు.

5. తరచూ పుట్టగొడుగులను తీసుకుంటే శరీరానికి సరిపడే విటమిన్ ‘డి’ పుష్కలంగా అందుతుంది. ఎండలో తిరగకుండా ఎక్కువ శాతం కూర్చుని పని చేసే వారికి ఈ విటమిన్ ఎంతో అవసరం ఉంటుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

6. ఎముకలు, దంతాలను దృఢంగా చేయడంలో పుట్టగొడుగులు ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే కాల్షియం కీళ్ల నొప్పులను కూడా త‌గ్గిస్తుంది.

మష్రూమ్స్ తినడం వల్ల లాభాలు :

1. ఏ నేలలో దొరికిన మష్రూమ్స్ తినడం వల్లనైనా న్యూట్రిషన్స్ (పోషకాలు) సమృద్ధిగా లభిస్తాయి. కేలరీస్, సోడియం, ఫాట్ , కొలెస్ట్రాల్ వంటి వాటి వల్ల వచ్చే ఏ జబ్బుకైనా పనిచేస్తాయి .

2. సెలెనియం అనేది మనిషి శరీరానికి అవసరమైన మినరల్ . దీనికవసరమయ్యే విటమిన్ ‘ఇ’ మష్రూమ్స్ తినడం ద్వారా వస్తుంది . ఇమ్యూన్ సిస్టమ్ లో కీలకపాత్ర పోషిస్తుంది . థైరాయిడ్ నివారణలోనూ బాగా ఉపయోగపడుతుందని తేలింది .

3. శరీరానికి పొటాషియం కూడా అవసరమే . గుండె పనితీరు క్రమబద్ధీకరణకు , ఫ్లూయిడ్ బ్యాలెన్స్ కు , కండరాలు , నరాల ఫంక్షనింగ్ కు అవసరమయ్యే పదార్దాలు మష్రూమ్స్ లోనే లభిస్తాయి . పొటాషియం మోతాదు ఎక్కువగా ఉంటుంది .

4. మనిషికి కావలసిన మరో ధాతువు కాపర్ . ఎర్రరక్త కణాలను బాగా వృద్ధి చేసేందుకు తోడ్పడే ఔషధ గుణం మష్రూమ్స్ లో ఉంటుంది .

5. నోటి పూత వస్తే బి కాంప్లెక్స్ వాడతాము . మష్రూమ్స్ తినడం వల్ల బి కాంప్లెక్స్ బాగా పెరుగుతుంది. బి కాంప్లెక్స్ అనుబంధంగా ఉండే రిబోఫ్లావిన్ , నియాసిన్ లనేవి మష్రూమ్స్ ద్వారానే లభిస్తాయి .

6. షుగర్‌ను తగ్గించే ఇన్సులిన్ వీటిల్లో ఉంటుంది కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని నిర్భయంగా తినవచ్చు. దీంతో బ్ల‌డ్ షుగ‌ర్ అదుపులో ఉంటుంది. క్యాలరీలను తక్కువగా ఇస్తాయి కాబట్టి గుండె జబ్బులున్న వారికి కూడా ఇవి సురక్షితమైన ఆహారమే.

Wonderful Saying : In our fast-forward culture, we have lost the art of eating well. Food is often little more than fuel to pour down the hatch while doing other stuff – surfing the Web, driving, walking along the street. Dining al desko is now the norm in many workplaces. All of this speed takes a toll. Obesity, eating disorders and poor nutrition are rife.

Book an appointment with us. We are just a Phone call away, Let us Talk.

Phone no : +91 9989759719

Amritha Ayurvedam Panchakarma Hospitals
D. No 4-62-7/A/1
plot No -162,MIG,
Main Road, 1st Floor,
Lawsons Bay Colony,
Near Baba Bazaar, Visakhapatnam,
Andhra Pradesh 530017

Follow Facebook, Twitter , Blog

#Mushrooms #Nutrients #obesity #bloodpressure #diabetics #insuline #potassium #immunity #selenium #nutrition #panchakarma #ayurvedam

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *