Home Remedies for Menstrual Cramps!!!!
బహిష్టు సమయంలో వచ్చే కడుపు నొప్పికి గృహ చికిత్సలు :
స్త్రీకి తల్లి కావడం ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో ,అలాగే నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి అంతే బాధను కలిగిస్తుంది . నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి చాలా మంది ఆడవాళ్ళకు సర్వసాధారణమైన విషయం !
అలాంటి ఆడవాళ్ళ కోసం ఇంట్లో లభ్యమయ్యే వస్తువులతో చాలా సులువుగా కడుపు నొప్పిని తగ్గించే గృహ చికిత్సల గురించి తెలుసుకుందాం .
కింద చెప్పిన వాటిల్లో ఏదో ఒకటి లేదా రెండు రకాల గృహ చికిత్సలను వాడి నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి నుండి విముక్తి పొందవచ్చు .
1) జీలకర్రని , వాముని విడివిడిగా నేతిలో వేయించి , దంచి తగినంత ఉప్పు కలిపి 1-2 చెంచాల పొడిని మజ్జిగలో వేసుకొని త్రాగండి . నెలసరి కడుపు నొప్పి తగ్గుతుంది .
2) దాల్చిన చెక్కను మెత్తగా నూరి , తేనెగానీ , పంచదారగానీ కలుపుకొని తీసుకుంటే అధికంగా ఋతురక్తస్రావం , నెలసరి క్రమంగా రాకపోవడం , నెలసరిలో కడుపు నొప్పి తగ్గుతాయి .
3) వెల్లుల్లి ఋతురక్తాన్ని శుభ్రపరుస్తుంది . ఋతురక్తాన్ని జారీచేస్తుంది . నెలసరి సమయంలో నొప్పిని తగ్గిస్తుంది .
4) వాముని నేతిలో వేయించి , మెత్తగా దంచి , తగినంత ఉప్పు కలుపుకొని అన్నంలో 1-2 చెంచాల పొడిని నెయ్యి వేసుకు తింటే నెలసరి నొప్పి తప్పకుండా తగ్గుతుంది .
5) పుదీనా ఆకురసాన్ని గాని , ఎండించిన పుదీనా ఆకుని మెత్తగా దంచి ఆ చూర్ణాన్ని గానీ తీసుకుంటే , తెరలు తెరలుగా వచ్చే నెలసరి కడుపు నొప్పి తగ్గుతుంది . ఋతురక్తం ఫ్రీగా అవుతుంది . ఈ మూడు రోజులూ తప్పని సరిగా పుదీనా పచ్చడి తింటే మంచిది . మామూలు కడుపు నొప్పికి కూడా ఇది మంచి వైద్యం .
0 Comments