మగవారిని అత్యంత ఆందోళనకు గురి చేసే విషయం వీర్యముతో పాటు రక్తం పడడం. దీని వలన మగవాళ్ళు చాలా మనోవేదనకు గురి అవుతారు.
కొంతమంది మగవారిలో అప్పుడప్పుడు ప్రోస్టేట్ గ్రంధి ప్రాంతములో ఉండే సిరలు తాత్కాలికంగా రక్తముతో నిండిపోయి ఒత్తిడిని ప్రదర్శిస్తాయి. అలాంటప్పుడు వీర్యములో రక్తము కనిపించే అవకాశం ఉంది. ప్రోస్టేట్ గ్రంధి అనేది మగవారిలో శుక్రకణాలు ప్రయాణించడానికి వీలుగా ఒక రకమైన ద్రవాన్ని తయారుచేస్తుంది .
ఇది పొత్తి కడుపు ప్రాంతములో, మూత్రకోశం కింద, మూత్రనాళాన్ని చుట్టి ఉంటుంది. కొంతమంది స్కలనాన్ని మధ్యలో ఆపివెయ్యడం వలన వీర్యములో రక్తము కనిపించడం వంటి వాటిని చూస్తుంటారు.
50 సంవత్సరాలు దాటిన వారిలో కొంతమందిలో ప్రోస్టేట్ గ్రంధి పెరుగుదలను చూస్తుంటాము దీనినే BPH (బినైన్ ప్రోస్టేట్ హైపర్ ట్రోఫీ) అంటారు.
ఈ BPH వ్యాధిలో కూడా వీర్యముతో పాటు రక్తము కనిపించే అవకాశము ఉంది.
ఈ లక్షణముతో పాటు తరుచుగా మూత్ర విసర్జన చెయ్యాల్సిరావడం,మూత్రము ధార సన్నగా అడ్డుకున్నట్లు ఉండడము,మూత్రము బొట్లు బొట్లుగా పడటం ,అనుకున్న వెంటనే మూత్రవిసర్జన చేయలేకపోవడం వంటి లక్షణాలను BPH లో చూస్తుంటాము.
కొంతమందిలో ప్రోస్టేట్ గ్రంథికి ఇన్ఫెక్షన్ సోకడము వలన కూడా పురుషాంగము నుండి చీములాగా రక్తముతో కూడిన ద్రవం కారడము కనిపించవచ్చు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మరియు మూత్ర మార్గములోనికి బలవంతముగా క్యాథెటర్ లను వెయ్యడం వంటి కారణాల వలన ప్రోస్టేట్ గ్రంధి ఇన్ఫెక్షన్లకి గురి అవుతుంది.
పై లక్షణాలకు సాదారణముగా యాంటిబయోటిక్స్ ఇస్తారు కానీ అవి అంత సమర్ధవంతముగా పని చెయ్యవు మరియు ఈ లక్షణాలు మాటిమాటికి కనిపించే అవకాశాలు చాలా ఉన్నాయి.
ఆయుర్వేదములో ఇటువంటి సమస్యలకు అద్భుతమైన ఔషధాలు చాలా ఉన్నాయి.
ఇవి ఇన్ఫెక్షన్ ని తగ్గించడమే కాకుండా మూత్రవ్యవస్థ ను పటిష్టముగా ఉంచడములో,వ్యాధిరహితముగా చెయ్యడములో సహాయపడతాయి.
ప్రోస్టేట్ గ్రంధి వాపుకి ఆధునిక వైద్యములో సర్జరీ అవసరము అని అంటారు.
కానీ సర్జరీ ఈ సమస్యకు పూర్తి పరిష్కారము కాదూ ,పైగా సర్జరీ తరువాత కొంతమందిలో నపుంసకత్వం కు దారి తియ్యవచ్చు.
ఆయుర్వేద చికిత్స ద్వారా ప్రోస్టేట్ గ్రంధి వాపుని ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించవచ్చు.
గృహ చికిత్సలు:
- పల్లేరు కాయల చూర్ణము ,కొండ పిండి వేళ్ళు చూర్ణము మరియు పటిక బెల్లము సమాన భాగాలుగా తీసుకొని, ఈ చూర్ణాన్ని ప్రతి రోజు ఉదయము పరగడుపున అరచెంచా చూర్ణముని గోరువెచ్చని నీటితో సేవించాలి.
- బూడిద గుమ్మడికాయ రసము ఒక గ్లాసు సేవించడం చాలా ఉత్తమము.
- ఉసిరికాయ చూర్ణము 25 గ్రాములు తీసుకొని ఒక లీటరు నీటిలో రుచికి సరిపడినంత బెల్లము వేసుకొని పది నిముషాలు పాటు మరిగించాలి . ఈ కషాయాన్ని రోజులో ఎప్పుడైనా కొంచెం కొంచెంగా సేవించడం వలన సత్వర ఫలితము కనిపిస్తుంది .
0 Comments