తెల్లబట్ట –  గృహచికిత్సలు :

ఈ మధ్య  కాలంలో చిన్నా ,పెద్ధా  అని తేడా లేకుండా  సాధారణంగా కనిపించే సమస్య  తెల్లబట్టవ్యాధి. ఇది సుమారు  100 మందిలో  80 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు .

 

తెల్లబట్ట- లక్షణాలు:

స్త్రీ యోనియందు బియ్యం కడిగిన నీటివలె ఉండే స్రావం వెలువడును . దీన్నే తెల్లబట్ట (వైట్ డిశ్చార్జ్ ) అందురు . జననాంగాలపట్ల ప్రత్యేకమైన శ్రద్ధ , పరిశుభ్రత పాటించక పోవడం ఈ వ్యాధికి ముఖ్య కారణం . ఇతర కారణాలనేకం వున్నాయి .

చాలా మంది స్త్రీలు ఈ సమస్యతో బాధపడుతున్నామని మొదట ఎవరితో చెప్పుకోరు , ఇలా చెప్పకుండా అశ్రద్ధ చెయ్యడం , డాక్టర్ సలహా తీసుకోకపోవడం వల్ల ఆ  సమస్య తీవ్రత ఇంకా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది .కాబట్టి ఈ సమస్యను ఏ మాత్రం నిర్లక్ష్యం చెయ్యద్దు .

స్త్రీ జననాంగంలోంచి పలుచటి తెల్లటి ద్రవం స్రవించడాన్ని’ కుసుమరోగం ‘ అని  ,  ‘తెల్లబట్ట’ అని  , ‘ల్యుకోరియా’ అని అంటారు .  ఈ తెల్లబట్ట అనేది నీరు వలె, తేటగా, జారుడు పదార్ధంలా ఉండే  సాగే గుణాన్ని కలిగి ఉంటుంది.  సహజంగానే స్త్రీ జననేంద్రియంలో ఎప్పుడు కొంత తడి ఉంటుంది . ఈ తడిలో లాక్టిక్ యాసిడ్ వుండి , అది జననాంగంలో వ్యాధులు రాకుండా నిరోధిస్తూ వుంటుంది .

నెలసరి రాబోయే ముందు , అండం విడుదల అయ్యే సమయంలోనూ , గర్భం దాల్చినప్పుడు , లైంగికోద్రేకం కలిగినప్పుడు ఈ ‘తడి ‘ కొంచెం ఎక్కువగా వుంటుంది .  కానీ , అది పరిమితి దాటి ఒక స్రావంలాగా బయటకు ఎక్కువగా వచ్చినప్పుడే ఇది ఒక వ్యాధిగా పరిగణించబడుతుంది . ఇది సాధారణమైన సమస్య కాదు , వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలి .

ఈ సమస్యతో బాధపడుతున్నవారికి  జననాంగాలలో దురద, మంటగా ఉండటం, కొంతమందికి ఆ స్రావం నుండి  దుర్వాసన కూడా వస్తుంది. నడుం నొప్పి మరియు పొత్తికడపులో నొప్పిగా ఉంటుంది. మానసిక స్థాయిలో చిరాకు, కోపం ఎక్కువగా ఉంటుంది .

ఈ తెల్లబట్ట సమస్య మనకు ఏ ఏ సందర్భాల్లో వస్తుంది :

ఈ తెల్లబట్ట అనేది ప్రతి ఒక్క అమ్మాయిలో 3 సార్లు వస్తుంది . ఎప్పుడెప్పుడంటే పీరియడ్స్ వచ్చే ముందు,  అంతేకాకుండా పీరియడ్స్ అయిపోయిన తర్వాత ,  మళ్ళీ  అండం విడుదల అయినప్పుడు, ఇలా  మూడుసార్లు వచ్చినట్లయితే ,అది పరవాలేదు  , కానీ కొన్ని కొన్ని సార్లు  ఈ తెల్లబట్ట అనేది పెరుగుగడ్డలాగా రావడం గానీ , ఒకవేళ ఆ తెల్లబట్టతో పాటు దురదగా ఉండడం గానీ, దుర్వాసనగానీ వచ్చినట్లయితే వెంటనే మీరు ఇందులో నైపుణ్యం ఉన్న  డాక్టరిని సంప్రదిండం శ్రేయస్కరం.

 

 

 

Home Remedies For White Discharge(తెల్లబట్ట ):

తెల్లబట్ట -గృహ చికిత్సలు :

 

*ముందుగా మీరు ఒక గ్లాసు నీటిలో నాలుగు చెంచాలు మెంతులను వేసి ఒక 20 నిమిషాలు బాగా మరిగించండి . ఆ నీటిని వడకట్టండి . అలా వడకట్టిన నీటిని  కొంచెం గోరువెచ్చగా చేసుకొని  ప్రతీ  రోజూ ఒక గ్లాసు  చెప్పున అలా ఒక 20 లేదా 25 రోజులు తాగినట్లయితే మీకు ఈ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది .

* ప్రతిరోజూ ఉదయం రెండు లేత బెండకాయలను తినండి . ఇలా 21 రోజులు క్రమం తప్పకుండా చేస్తే మంచిది .

* పరిశుభ్రమైన నీటిని 600 మిల్లీలీటర్లు తీసుకొని , దానికి 15 గ్రాముల పటిక కలిపి ఆ నీటితో యోని భాగాన్ని శుభ్రంగా కడిగి , పటిక నీటితో తడిపిన శుభ్రమైన వస్త్రాన్ని రోజు కొంతసేపు యోని మార్గంలో ఉంచితే స్త్రీలలో ఎదురయ్యే తెల్లబట్ట సమస్య , దురద వంటివి కూడా  తగ్గుతాయి .

* ఏలకులను వలిచి , లోపలగింజల్ని ప్రతిరోజూ తినండి  . దీని వల్ల జననాంగాలకు సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి . చలవ కూడా చేస్తుంది .

* ఉసిరి కాయ పొడి , పటిక బెల్లం పొడి , మీకు కావలసినంత  మోతాదులో  సమానంగా తీసుకొని  రెండిటిని కలిపి పెట్టుకోండి . ఉదయం ఒక చెంచా , సాయంత్రం ఒక చెంచా తినండి .

* రావి చెట్టు బెరడు , తుమ్మ చెట్టు బెరడుని సమానంగా తీసుకొని దంచి  పొడి చేసి, ఆ పొడిని  జల్లించి ఉంచుకోండి . ఒక గ్లాసు నీళ్ళల్లో చెంచా పొడి వేసి కషాయం చేయండి , ఆ కషాయాన్ని వడ కట్టండి . ఆ కషాయాన్ని గోరువెచ్చగా చేసుకొని చెంచా పటిక బెల్లం పొడిని అందులో కలిపి తాగండి . ఇంకా ఎటువంటి సమస్య మీ దగ్గరికి రాదు .

* చెక్కర కేళి అరటి పండు లేదా బాగా పండినటువంటి అరటిపండును తీసుకొని , ఒక ప్లేటులో కొద్దిగా నెయ్యి , కొద్దిగా పంచదార కలుపుకొని ఉంచుకొని అరటిపండును అందులో కలుపుకొని తినాలి . ఇలా 4 రోజులు చేయనట్లయితే ఈ తెల్లబట్ట అనే వ్యాధి తగ్గుమొఖం పడుతుంది .

* గంజిలో ఒక చిటికెడు పసుపు లేదా మిరియాల పొడిని కలుపుకొని తాగండి .

* ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు బార్లీ నీళ్లను తాగండి.

*  ఏలకులను వలిచి , లోపలగింజల్ని ప్రతిరోజూ తినండి  . దీని వల్ల జననాంగాలకు సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి . చలవ కూడా చేస్తుంది .

తెల్లబట్ట-తీసుకోవాల్సిన జాగ్రత్తలు

* వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం.

* కాటన్ లోదుస్తులు వాడడం.

* బహిష్ఠు సమయంలో శానిటరీ నాప్కిన్స్ వాడడం, వాటిని ప్రతి రెండు గంటలకూ వాటిని మార్చుకోవడం.

* జననేంద్రియాలను గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవడం.

* గాఢమైన కెమికల్స్ కలిగి వుండే డెట్టాల్  సబ్బులు వాడకూడదు. మైల్డ్ సోప్స్‌తో శుభ్రం చేసుకోవాలి.

* జననేంద్రియాల వద్ద ఎలాంటి పెర్ఫ్యూమ్స్, సుగంధ ద్రవ్యాలు వాడరాదు.

* దుర్వాసన, దురదతో కూడిన తెల్లబట్టను గుర్తించగానే డాక్టర్ని సంప్రదించి జీవిత భాగస్వాములిద్దరూ చికిత్స తీసుకోవడం అవసరం.

* శారీరక శుభ్రత పాటించడం.

* మానసికంగా సంతోషంగా ఉండాలి .

* ఆహారంలో మెంతులు , ఎండిన కొత్తిమీర , పండిన అరటిపండ్లు వంటి వాటిని చేర్చుకుంటే తెల్లబట్టని అదుపుచేయవచ్చు .

* మీరు తినేతిండిలో కారం ,  ఉప్పు బాగా తగ్గించుకొని తినండి.

 

తెల్లబట్ట సమస్యతో బాధపడేవారు పైన చెప్పిన గృహచికిత్సలు మరియు జాగ్రత్తలు పాటించి మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడమే కాక మీ స్నేహితులతో ఈ సందేశాన్ని షేర్ చెయ్యండి.

Open chat
1
Hi!
How Can I Help You?