స్త్రీ వంద్యత్వం – ఆయుర్వేదం చికిత్స!!

స్త్రీ జీవితానికి పరిపూర్ణత అనేది మాతృత్వం ద్వారానే లభిస్తుంది. ప్రతి స్త్రీ తన జీవితంలో ఒక్కసారైనా గర్భం దాల్చాలని,మాతృత్వాన్ని పొందాలనీ ఎంతో ఆశగా కోరుకుంటుంది .అలాంటి స్త్రీ జీవితంలో ఎంత ప్రయత్నించినా పిల్లలు కలగకపోవడం అనేది ఒక శాపంగా బాధ పడుతుంటారు.

ఈ ఆధునిక రోజుల్లో చాలా మంది మహిళలు ఎదుర్కుంటున్న సమస్య సంతాన లేమి.సంతానలేమి కి చాలా కారణాలు ఉన్నాయి అందులో ఈ ఫాల్లోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వటం ఒకటి.

35 % మహిళలలో పిల్లలు పుట్టక పోవడానికి గల ముఖ్య కారణం ఈ ఫాల్లోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వటం వల్లనే జరుగుతోంది.మనం ఈ విషయం గురించి చర్చించుకుందాం.

 

 

 

 

Ayurvedic Treatment For Blocked Fallopian Tubes!

                                      Ayurvedic Treatment For Blocked Fallopian Tubes!

 

ఫాల్లోపియన్ ట్యూబ్స్ అంటే ఏమిటి?

ఫాల్లోపియన్ ట్యూబ్స్ ని అండవాహిక గొట్టాలు అని అంటారు. ఇవి గర్భాశయనికి ఇరు ప్రక్కలా ఉంటాయి. ఈ ఫాల్లోపియన్ ట్యూబ్స్ లోనే స్త్రీ విడుదల చేసేఅండం పురుషుడు యొక్క వీర్య కణంతో సంయోగం చెందుతుంది. ఈ సంయోగం చెందిన అండము గర్భాశయంలోకి ప్రయాణిస్తుంది. ఈ ట్యూబ్స్ లోని కండరాలు, సిలియా లైనింగ్ అనేవి ఉంటాయి ఇవి అండాన్ని ముందుకి కదల్చటానికి చేసే ప్రయత్నాన్ని మొటిలిటి అంటారు. ఈ మొటిలిటి చర్యకు ఆటంకం కలిగినా కూడా అది ఆ స్త్రీ గర్భాన్ని దాల్చాటానికి అవరోధంగా పరిణమిస్తుంది. ఫాల్లోపియన్ ట్యూబ్స్ మొత్తం మీద ఎక్కడ బ్లాక్ఉన్న కూడా అండం ప్రయాణం అనేది జరగదు ఫలితంగా సంతాన లేమి అనేది దారితీస్తుంది.

అయితే ఒక్కోసారి సంయోగం చెందిన అండం గర్భాశయంలోకి ప్రయాణం చేయకుండా పొరపాటున ఈ అండవాహిక గొట్టాలలో మిగిలిపోయి ఆ స్త్రీకి ప్రేగ్నన్సి అండవాహికలలోనే జరగవచ్చు దీన్నే ఎక్టోపిక్ ప్రేగ్నన్సి అంటారు. ఈ విధంగా వచ్చిన ప్రేగ్నన్సిని ఉంచుకోవటం ప్రాణానికి ప్రమాదకరం అందుకే దీన్ని ఆపరేషన్ ద్వారా తొలగిస్తారు.
ఏ కారణము వల్లనైన ఫాల్లోపియన్ ట్యూబ్ మూసుకుపోవటం, infection గురి అయ్యి పగుళ్ళు బారటం జరిగితే మొటిలిటికీ భంగం కలిగి అది గర్భధారణను దెబ్బ తీస్తుంది.

బ్లాక్డ్ ఫాల్లోపియన్ ట్యూబ్స్ అంటే ఏమిటి?

కొంత మంది స్త్రీలలో కొన్ని కారణాల వల్ల ఈ ట్యూబ్స్ ఒక వైపు లేక రెండు వైపుల బ్లాక్స్ అనేవి ఉండవచ్చు, అలానే ఈ బ్లాక్ అనేది ట్యూబ్ మొత్తం మీద ఎక్కడైనా అవ్వచు.

అసలు ఫాల్లోపియన్ ట్యూబ్స్ లో బ్లాక్ ఉందని ఎలా తెలుసుకోవచ్చు?

Hysterosalpingography(HSG) అనే X-ray ద్వారా ఫాల్లోపియన్ ట్యూబ్స్ బ్లాక్ గురించి తెలుసుకోవచ్చు.

ఫాల్లోపియన్ ట్యూబ్స్ లో బ్లాక్ అవ్వటానికి గల కారణాలు :

***PID పెల్విక్ inflamatory disease
***Chalmydia, గనేరియా లాంటి రోగాలు రావటం
***IUD మూలంగా damage కావటం
***ప్రసవం తరవాత వచ్చే infection వల్ల
***అబార్షన్ తరవాత వచ్చే infection వల్ల
***అపెండిక్స్ rupture కావటం
***ఎక్టోపిక్ గర్భం
*** Endometriois
*** T.B తో బాధ పడే స్త్రీలలో ఈ ఫాల్లోపియన్ ట్యూబ్స్ ముసుకుపోయే
అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి
*** Uterine fibroids

అల్లోపతి వైద్యం లో IVF ఒకటే మార్గం అని వైద్యులు చెప్తుంటారు కానీ ఈ IVF వల్ల సంతాన సాఫల్యత శాతం చాలా తక్కువగా ఉంది, అంతే కాకుండా ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యం.

Ayurvedic Treatment For Blocked Fallopian Tubes!

ఆయుర్వేదం చికిత్సా విధానం :

ఆయుర్వేదం ప్రకారంగా ఫాల్లోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్న స్త్రీలలో వాత,పిత్త మరియు కఫ దోషాల అసమతుల్యత ఎక్కువగా ఉంటుంది.

ఆయుర్వేదం మందుల ద్వారా ఈ అసమతుల్యతను సమతుల్యం చేసి శరీరంలో ఉన్న మలినాలను తొలగించి శరీరానికి పునర్జీవనశక్తిని కలిగిస్తుంది.

పంచకర్మ చికిత్సా విధానలలో అభ్యంగన, స్వేదన, వమన, విరెచన ,వస్తి,ఉత్తరవస్తి,యోనిపిచు ద్వారా ఈ బ్లాక్స్ ని క్లియర్ చేసి సంతాన సాఫల్యతని 100% అందించవచ్చు.

#Appointments కొరకు సంప్రదించవలసిన నెంబరు -#9989759719

అమృత ఆయుర్వేదం పంచకర్మ హాస్పిటల్,
Dr.#BheesettiSanthisree
D. No 4-62-7/A/1
plot No -162,MIG,
Main Road, 1st Floor,
Lawsons Bay Colony,
Near Baba Bazaar
#Visakhapatnam,
Andhra Pradesh 530017

Open chat
1
Hi!
How Can I Help You?