Amoebiasis – Ayurvedic Treatment for Positive Results #3

Ayurvedam treatment | Home Remedies

Amoebiasis – Ayurvedic Treatment for Positive Results #3

అమీబియాసిస్ వ్యాధికి ఆయుర్వేద చికిత్స :

ఇతర వ్యాధులతో పోల్చినప్పుడు ఆయుర్వేద శాస్త్రంలో అమీబియాసిస్ వ్యాధి గురించి చాలా ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగిందనాలి.  జీర్ణకోశ వ్యవస్థ గురించి, జీర్ణప్రక్రియ గురించి ఆయుర్వేద శాస్త్ర గ్రంథాల్లో చెప్పిన విషయాలు ఈనాటి ఆధునిక వైద్యశాస్త్రం చెప్తున్నవాటికి భిన్నం కావనీ , చాలాచోట్ల అదనపు విషయాలు కనిపిస్తాయని కూడా అర్ధం అవుతుంది .

శాస్త్రపరమైన అంశాల జోలికి వెళ్ళకుండా  అమీబియాసిస్ వ్యాధి గురించి ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుందో మొదట అర్ధం చేసుకుందాం .

1. అతిసార వ్యాధికి కారణమయ్యే అంశాలన్నీ అమీబియాసిస్ వ్యాధికి కారణం అవుతాయి .

2. ఏ కారణం చేత విరేచనాల వ్యాధి కలిగినా , దాన్ని తగ్గించుకోవడానికి గానీ , అది తగ్గిన తర్వాత గానీ , తీసుకోవాల్సిన జాగ్రత్తలు తగినన్ని తీసుకోకపోవడం వలన కూడా అమీబియాసిస్ వ్యాధి దీర్ఘవ్యాధిగా మారుతుంది.

3. ఎంత ఆహారం , ఎలాంటిది తీసుకున్నారనే దాని కన్నా , ఎవరి జీర్ణశక్తి ఎంత అనేది ముఖ్యమైన ప్రశ్న ! జీర్ణశక్తిననుసరించి తగినంత ఆహారమే తీసుకోగలిగితే , అమీబియాసిస్ వ్యాధి తిరగబెట్టకుండా ఆగుతుంది. జీర్ణశక్తి తక్కువ , కఠినంగా అరిగే ఆహార పదార్దాలు తీసుకోవడం ఎక్కువ అయినప్పుడు అమీబియాసిస్ వ్యాధి కడుపులో అలజడిని సృష్టిస్తుంది .

4, జఠరాగ్నికి ‘పుట్టిల్లు ‘ అనదగిన ప్రేగు భాగాన్ని ” గ్రహిణి ” అంటారు . జఠరాగ్నిని చెడగొట్టి , మందగింపచేసే ఆహారాలు తీసుకున్నప్పుడు ఈ గ్రహిణి అనే అవయవం చెడినట్టు లెక్క ! అందుకని ఈ వ్యాధిని ”గ్రహిణీ  వ్యాధి ” అని పిలుస్తారు .

5. అమితంగా దప్పిక , ఏ పనీ చెయ్యబుద్ది కాకపోవడం , అజీర్తి , తిన్నది ఎప్పటికోగానీ జీర్ణం కాకపోవడం , శరీరం బరువుగా ఉండటం ….. ఇలాంటి లక్షణాలన్నీ అమీబియాసిస్ వ్యాధి రాబోతుందని హెచ్చరించే అంశాలు . అంటే , ప్రేగుల్లో ‘గ్రహిణి ‘ అనే భాగం దెబ్బతింటోందని అర్ధం!

ఈ ఐదు అంశాల్ని బట్టీ మనకు మౌలికంగా ఒక్క విషయం స్పష్టమైంది . అమీబియాసిస్ వ్యాధి అనేది కేవలం నోటి ద్వారా మాత్రమే కడుపులోకి ప్రవేశిస్తోందనీ , ఈ ద్వారాన్ని మూసేస్తే తప్ప ఈ వ్యాధికి విమోచనం , విముక్తి లేదనీ , అంటే తీసుకునే ఆహారం ద్వారా , నీటి ద్వారా అమీబియాసిస్ అనే గ్రహిణీ వ్యాధి కడుపులోకి ప్రవేశిస్తోంది . అలాంటి ఆహార పానీయాల్ని ఆపడం వలన మాత్రమే ఈ వ్యాధి అదుపులో రావడం సాధ్యం అవుతుంది .

ఇప్పుడు మీకు అసలు విషయం అర్ధం అయ్యే ఉంటుంది . అమీబియాసిస్ వ్యాధి దీర్ఘవ్యాధిగా మారడానికి కారణం జీర్ణశక్తి మందగించడమేనని! పర్వతాలు పలహారం చెయ్యగల జీర్ణశక్తి ఉన్న వ్యక్తికి విషం పెట్టినా అరిగించుకొని ఆనందంగా తిరిగేస్తుంటాడు . అదే జీర్ణశక్తి మందంగా ఉన్న వ్యక్తి అమృతం ఇచ్చినా ఏదొక వ్యాధి లక్షణాన్ని తెచ్చిపెడుతూనే ఉంటుంది! అమీబియాసిస్ వ్యాధి ఇలానే దీర్ఘవ్యాధిగా మారి విడవకుండా జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది .

అందుకని , అమీబియాసిస్ వ్యాధితో తరచూ బాధపడేవారు తమకు తాముగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతుందో పరిశీలిద్దాం …..

1. పాతబియ్యం , తేలికగా అరిగేవి మాత్రమే తినండి . కొంచెం దోరగా వెయ్యించి వండుకుంటే , తేలికగా అరుగుతాయి .

2. మరమరాలు (వరిపేలాలు ) జావలాగా కాచుకొని త్రాగితే అరుగుదల బాగుంటుంది . సగ్గుబియ్యంజావ, బార్లీజావ అమీబియాసిస్ వ్యాధిలో ప్రేగుల్ని బలసంపన్నం చేస్తాయి .

3. కందికట్టు , పెసరకట్టు , చింతపండు వెయ్యని పప్పుచారు ఈ వ్యాధిలో ప్రేగుల్ని కాపాడుతుంది .

4. పెరుగు , దానికన్నా చక్కగా చిలికిన మజ్జిగ ఈ వ్యాధిలో అమృతంలా పనిచేస్తాయి . అమీబియాసిస్ వ్యాధిలో మజ్జిగే అసలైన మందులా ఉపయోగపడుతుంది .

5. నువ్వుల నూనెని వంటకాలకు వాడడం మంచిది . అయితే , నూనె అతిగా వాడకూడదు .

6. మంచి తేనే , పటికబెల్లం , ఎండుద్రాక్ష , నేరేడు పండు , వెలగపండు , దానిమ్మపండు , పొగడపండు , అరటిపండు , బూడిదగుమ్మడి ఈ వ్యాధిలో తప్పనిసరిగా తీసుకోవలసిన అంశాలు .

7. లేత అరటి కాయల్ని నిప్పుల మీద కాల్చిగానీ , ఉడకబెట్టి గానీ వండిన కూర ఈ వ్యాధికి బాగా ఉపయోగపడుతుంది .

8. పెరుగు , పచ్చడి రూపంలో వండిన ఆహారపదార్దాలు ఎక్కువ మేలుచేస్తాయి .

9. నెయ్యి , వెన్నపూస , మీగడ ప్రేగుల్ని సంరక్షించి అమీబియాసిస్ వ్యాధి నుండి కాపాడతాయి .

10. కుందేలు , మేక మాంసాలు ఈ వ్యాధిలో మేలు చేస్తాయి .

11. ఉల్లిపాయలతో చేసిన పెరుగుపచ్చడి మంచిది .

12. చద్దన్నం, పులిసిపోయిన వస్తువులు, పాచిపోయినవి పొరబాటున కూడా తినకండి .

13.  గోంగూర , బచ్చలి , చుక్కకూర , చింతపండు వేసి వండిన ఆహార పదార్దాలు , కంద , పెండలం , చేమదుంప , బంగాళదుంప , రేగుపళ్ళు , మామిడికాయలు , నారింజ , ముదిరినకొబ్బరి , పచ్చిదోసకాయ ….. ఇవి తిన్నప్పుడు అమీబియాసిస్ వ్యాధిని పిలిచినట్టే అవుతుంది .

14. పాలు , పాలుపోసి వండిన తీపిపదార్దాలు , శనగపిండితో వండిన తీపిపదార్దాలు అపకారం కలిగిస్తాయి . పాలు ఈ వ్యాధిలో పూర్తిగా నిషేధం .

15. శనగలు , మినుములు , బఠాణీలు , పెసలు , వాటి పిండితో తయారయిన వంటకాలు ఖచ్చితంగా చెరుపుచేసి తీరుతాయనని గుర్తించండి .

16 . చేపలు , రొయ్యలు , పందిమాంసం , ముదురు కోడిమాంసం ప్రేగుల్ని దెబ్బతీస్తాయి .

17. పొగత్రాగడం , ఆల్కహాలు , గుట్కాలు , జర్దాలు , అమీబియాసిస్ వ్యాధిలో అపకారం చెయ్యడమే కాకుండా అల్సర్లు రావడానికి కూడా కారణం అవుతాయి .

18. అరటిపువ్వు , అరటి ఊచ , అరటి దుంప వీటన్నింటినీ ఆహార పదార్దాలుగా వండుకొని తింటే , అమీబియాసిస్ వ్యాధి అదుపులోకి వస్తుంది . పెరుగు కలిపి తాలింపు పెట్టుకుంటే ఇంకా ఎక్కువ మేలు చేస్తుంది .

19. బూడిద గుమ్మడి కాయ లోపలి గుజ్జును కూడా పచ్చిగాగానీ , ఉడికించిగానీ , పెరుగు పచ్చడిగా చేసుకొని తింటే , ప్రేగులకు మేలునిస్తుంది.

అమీబియాసిస్ వ్యాధిలో ఔషధ గుణాలు :

అమీబియాసిస్ వ్యాధి వచ్చినప్పుడు విరేచనం ఎక్కువసార్లు అవ్వడమో , అస్సలు అవ్వకుండా బిగదీసి బాధించడమో చేస్తుంది . కరక్కాయ లోపలి గింజలు తీసేసి పై బెరడుని మెత్తగా దంచిన పొడిని అరచెంచా మోతాదులో తేనెలో తీసుకోండి . లేదా మజ్జిగలో కలిపి త్రాగండి . విరేచనం ఫ్రీగా అవుతుంది .

Book an appointment with us. We are just a Phone call away, Let us Talk.

Phone no : +91 9989759719

Amritha Ayurveda Panchakarma hospital;
Dr.santhisree Bheesetti
D. No 4-62-7/A/1,plot No -162,MIG,
Main Road, 1st Floor,
Near Baba Bazaar, Lawsons Bay Colony, Visakhapatnam,
Andhra Pradesh 530017
099897 59719

Follow Facebook, Twitter , Blog

0 Comments

Submit a Comment

Your email address will not be published. Required fields are marked *

Dr. Santhisree Bheesetti

Driven by her passion, she has cultivated a profound understanding of complex conditions like Autism, ADHD, Cerebral Palsy, Down Syndrome, Speech disorders, and Anxiety disorders, alongside her specialization in Women’s issues and Neurological disorders in adults.
Understanding the Benefits of Takradhara for Children on the Spectrum

Understanding the Benefits of Takradhara for Children on the Spectrum

Ancient wisdom often holds solutions that exceed time, providing solutions that are both gentle and effective. Takradhara, an Ayurvedic therapy, is one of the practices that has stood still for centuries. Deeply rooted in holistic healing, this practice has gained...

Ready to Restore Harmony in Your Mind, Body, and Spirit

Our Treatments

Panchakarma

Shiro Abhyanga

Nasya Karma

Takradhara

Vasti Benefits

Open chat
1
Hi!
How Can I Help You?