Aloe vera has a Clueless and real shocking facts #1 – An Ultimate Number 1 Article don’t miss to read

నూరేళ్ళ ఆరోగ్యానికి ‘కలబంద’ (Aloe Vera) సేవించండి

దేహంలోని రుగ్మతలను , దీర్ఘ రోగాలను నయం చేయడంలో ‘కలబంద ‘ కు మించిన ఆహార ఔషధం మరొకటి లేదు . అందుకే కలబంద గురించి ఎంత రాసినా అది తక్కువనే చెప్పాలి . మానవునికి సంపూర్ణ ఆరోగ్యాన్ని , దీర్ఘ ఆయుష్షును ప్రసాదించే ఈ మహత్తర మొక్క గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని తీరాల్సిందే ..! పైసా ఖర్చు లేకుండా పెరట్లో పెంచుకుని రోజూ ఒక టీ స్పూన్ కలబంద గుజ్జు తింటే ఆరోగ్యవంతమైన జీవితం మీ సొంతం అవుతుంది . ఇంత చెప్పినా అసలు కలబందను ఎందుకు సేవించాలో .. మీకు తెలియాలంటే ? కాస్త లోతుగా కలబంద గురించి తెలుసుకోవాలి  .

అలోవెర’ (కలబంద ) దీర్ఘ వ్యాధులను నయం చెయ్యడానికి , ఆ దైవం ప్రసాదించిన దివ్య ఔషధం. కలబందను కేవలం వ్యాధిగ్రస్తులే కాదు ఆరోగ్యవంతులు కూడా వాడవచ్చును . వ్యాధిగ్రస్తులు వాడితే వ్యాధులు పూర్తి స్థాయిలో నియంత్రింపబడతాయి . ఆరోగ్యవంతులు వాడితే జీవితంలో ఎటువంటి రుగ్మతలు , వ్యాధులు దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చును . ప్రతి మానవుడు తాను నిండు నూరేళ్ళు ఆనందంగా , సంపూర్ణ ఆరోగ్యంగా జీవించడానికే ఇష్టబడతారు . ఆరోగ్యవంతులుగా నిత్యయవ్వనంగా జీవితంలో వ్యాధుల బారిన పడకుండా సంతోషంగా ఆరోగ్యవంతంగా జీవించడానికి భూమిమీద ఆ దైవం మానవునికి అందించిన అపర సంజీవిని ‘కలబంద ‘ . ప్రతిరోజూ కలబందను క్రమం తప్పకుండా సేవిస్తే .. దీర్ఘ ఆయుష్షు సొంతం చేసుకోవచ్చును .
మానవాళి  ఈనాడు భయంతో జీవిస్తుంది . ఎందుకంటే ? ఏ క్షణంలో ఏ జబ్బు వస్తుందో ? ఏం జరుగుతుందో ? అనే భయం . చాలా మంది అనుకుంటుంటారు అసలు వ్యాధుల భయం లేకుండా ఉంటే ? ఎంత బాగుంటుందని . జీవన ప్రయాణంలో అనారోగ్యాలు జీవితాలను అస్తవ్యస్తం చేస్తుంటాయి . వాటిని ఎదుర్కోవాలంటే ? వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి .  ముఖ్యంగా ఆరోగ్యoగా ఉండాలంటే ? ఏం చెయ్యాలి ? అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలి . ఎందుకంటే ? ఈ రోజుల్లో వ్యాధులొస్తే తగ్గడం మాట అటుంచితే ఉన్న ఆస్తి అంతా ఆపరేషన్లకు , మందులకు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది . అందుకే తెలివైన వారు తమ ఆరోగ్యం పట్ల జాగరూకత కలిగి ఉంటారు . కోట్లకు కోట్లు సంపాదించినా ఆరోగ్యం లేకపోతే అంతా వ్యర్థమని గుర్తించాలి . ఆరోగ్యం కోసం తపనపడే వారికోసం ఆహార ఔషదాలతో ఆరోగ్యం పొందడం ఎలా ? అని ఎదురుచూస్తున్న వారికోసం ఈ కలబంద రహస్యాలను తెలియచేస్తున్నాం .
మన పూర్వీకులు అనేక వందల సంవత్సరాలు జీవించడానికి కారణం ఏమిటీ ? స్కానింగులు , ఆపరేషన్లు , మందులు లేని ఆనాటి కాలంలో మన పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా జీవించడానికి కారణం ఏమిటీ ? ఆరోగ్యవంతులుగా , ఆదర్శవంతులుగా నూరేళ్ళు ఆనందంగా ఉండటానికి  కారణం ఏమిటీ ? ఆనాడు గుండెజబ్బులు , షుగర్ వ్యాధులు , కీళ్ళ , కిడ్నీ , మానసిక సమస్యలు లేవు . కానీ నేడు మానవదేహమంతా వ్యాధుల మయం అవుతుంది . దానికి అనేక కారణాలు వాటిలో విషతుల్యమైన ఆహారం సేవించడం , వాతావరణం విషతుల్యం కావడం , కల్తీ ఆహారం , మందులు వాడటం , ఆహార నియమాల్లో నిబద్ధత లేకపోవడం , వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు .
ఇంకా భావి జీవితంలో గుండె , కిడ్నీ , క్యాన్సర్ , శక్తిహీనత , షుగర్ వంటి రుగ్మతల నుండి రక్షణ పొందవచ్చును . వ్యాధి నిరోధం కన్నా వ్యాధి నివారణే మిన్న అన్న సూక్తికి అక్షర సాక్ష్యం కలబంద .
పైసా ఖర్చు లేకుండా మీ పెరట్లో ‘కలబంద ‘ మొక్కలను పెంచుకుంటూ , ప్రతి రోజూ కలబందను సేవించడం ద్వారా ఆరోగ్యవంతులుగా మారవచ్చును . కలబందలో అనేక విటమిన్స్ , ఎంజైమ్స్ , ప్రోటీన్స్ , కాల్షియం వంటివి మానవ దేహానికి కావాల్సిన అన్ని రకాలు ఇందులో ఇమిడి ఉంటాయి .
ఆరోగ్యం రహస్యం తెలుసుకున్నారు కాదు.. ! ఇక కలబందను నేటి నుంచి సేవించండి . ఆరోగ్యవంతునిగా మారండి . కలబందను ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి ..! కలబంద కన్నతల్లికంటే వందరెట్లు మేలుచేస్తుందని పదిమందికి చెప్పండి .
  1) తలనొప్పి , పార్శపు నొప్పి : అన్ని రకములైన , జలుబు , సర్దిపడిశము , తలనొప్పి , తల తిరుగుట , శ్లేష్మ వ్యాధులకు కలబంద జ్యూస్ ఉపయోగకరమైన ఔషధము . మలబద్ధకమును నివారిస్తుంది . బలహీనతను తగ్గిస్తుంది .
2) బుద్ధిమాంద్యము లేక మెదడు బలహీనత : కలబంద ఫ్యూర్ జ్యూస్ మెదడుకు బలాన్ని చేకూర్చుతుంది . కంటి చూపుకు బలాన్ని ఇచ్చి కళ్ళు బాగా కనబడేటట్లు చేస్తుంది . దీర్ఘకాలంగా ఉన్న జలుబును నివారిస్తుంది . తలనొప్పిని మాయం చేస్తుంది.
3)పక్షవాతము : పక్షవాతము ముఖ్యముగా నరములకు సంబంధించిన వ్యాధి . ఇందులో కాలు చేయి పడిపోవటంగానీ , లేక ఏదో ఒక భాగం అంటే కాలుగాని , చేయిగాని , పనిచేయకుండా ఉండిపోతుంది . కలబంద సేవిస్తే ఫలితం ఉంటుంది

4) షుగర్, గుండె , కిడ్నీ వ్యాధులు : కలబంద జ్యూస్ షుగర్ వ్యాధిని నియంత్రించి , పాంక్రియాస్ ను పునర్జీవింపజేస్తుంది . షుగర్ వల్ల వచ్చే అనర్ధాలు అంటే గుండె , కిడ్నీ(Kidney Stones and Home Remedies), కంటి జబ్బులు రాకుండా రక్షణ నిస్తుంది.సమస్త దోషాలను తొలగించి మానవుని  ఆయుర్ధాయాన్ని పెంచి , సంపూర్ణ ఆరోగ్యం ‘కలబంద’ అందిస్తుంది.

5) నేత్ర వ్యాధులు : దృష్టి మాంద్యము లేక చూపు తగ్గుట, కంటి చూపు సరిగ్గా లేకపోవుట , మసకగా కనపడుట , వంటి లక్షణాలు ఉంటే కలబంద ఫ్యూర్ జ్యూస్ మంచి ఫలితం ఇస్తుంది .
6) గొంతు సంబంధ వ్యాధులు : కలబంద జ్యూస్ గొంతు నొప్పి వాపులు , గొంతులో కురుపులకు అత్యుత్తమైనదిగా పనిచేస్తుంది .
7) ఆయాసము ( Asthma ) లేదా ఉబ్బస వ్యాధి : ఉబ్బస రోగంలో రోగి శ్వాస పీల్చుకోవటానికి బాధపడుతున్నప్పుడు కలబంద రసం వాడితే శ్వాస బాగా అంది ఉపశమనము కలుగుతుంది . దగ్గుని తగ్గించి ఉపశమనము ఇస్తుంది .
8) గుండె జబ్బులు లేక హృద్రోగములు: గుండె ఎక్కువగా కొట్టుకొనుట . గుండె బలహీనతలో  ,గుండె దడలలో వాడిన కలబంద సేవించడం వల్ల గుండె రక్త నాళాలు పరిశుభ్రపరచబడి గుండె జబ్బులను నివారిస్తుంది
9) ఉదర వ్యాధులు : ఉదర వ్యాధులు లేక జీర్ణకోశ వ్యాధులకు సంబంధించిన వ్యాధులకు కలబంద రసం అద్భుతంగా పనిచేస్తుంది . అజీర్ణం , పుల్లటి త్రేన్పులు , కడుపులో గ్యాసెస్ కి , ఛాతిలో మంట , వికారము ఉన్నప్పుడు , ఆకలిలేని సమయంలోను , కడుపులో నొప్పికి , కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు మరియు అన్ని రకాల ఉదర సంబంధ వ్యాధులకు అపర సంజీవినిగా కలబంద పనిచేస్తుంది .
10) కడుపులో నొప్పి – అజీర్ణం వ్యాధులు : వాయువుతో కలిగే కడుపు నొప్పికి పనిచేస్తుంది . వాయువును వెడల గొడుతుంది . జీర్ణ శక్తిని పెంచుతుంది .ఎక్కిళ్ళు తగ్గిస్తుంది . తిన్న ఆహారం జీర్ణం కావడానికి సహాయ పడుతుంది .  వాయువును బయటకు పంపుతుంది . సమస్త అజీర్ణ వ్యాధులకు అద్భుతంగా పనిచేస్తుంది
11) మలబద్ధకము : విసర్జనము సరిగ్గా లేకపోవుటను , మల బద్ధకమును నివారిస్తుంది . కలబంద తేలికపాటి విరేచనకారి మలబద్ధకంలో వాడదగినది . అన్ని రకములైన జ్వరములలో వాడవచ్చును . కడుపు , ప్రేగుల బలహీనతను పోగొడుతుంది . వాటి వలన వచ్చే విరేచనాలను తగ్గించి , ప్రేగులకు బలం చేకూర్చుతుంది . పేగులలోని మలాన్ని ద్రవంగా మార్చి మలబద్ధకాన్ని పోగొడుతుంది . కడుపులో ఉండే ఎటువంటి పురుగులనైనను చంపుతుంది . మరియు బయటకు పంపుతుంది . భవిష్యత్తులో వీటిని రాకుండా ఆపుతుంది.
12) మొలలు (ఫైల్స్) : అంతర్గత మరియు బహిర్గత మొలలకు రక్తము కారుట నివారించి మూలశంఖను పూర్తిగా నివారిస్తుంది . జీర్ణశక్తిని పెంచి , అజీర్తిని దూరం చేస్తుంది . మలబద్ధకాన్ని పోగొడుతుంది . మొలల వాపులో వచ్చే నొప్పిని , మంటను తగ్గిస్తుంది . మొలలను రాలగొడుతుంది .

13) మూత్ర పిండ & మూత్రకోశ వ్యాధులు : మూత్రపిండ , మూత్రకోశంలో ఉన్న రాళ్ళను ముక్కలు చేసి బయటకు పంపుతుంది . మూత్రం ఆగినప్పుడు ,  మూత్రకోశంలో నొప్పికి కలబందను వాడితే తగ్గిస్తుంది . రాళ్ళను ,మూత్రం ద్వారా బయటకు పంపుటలో కలబందకు మించింది మరొకటి లేదు .

14)బుద్ధి మాంద్యము లేక మెదడు సంబంధ వ్యాధులు : కలబంద మెదడుకు శక్తిని చేకూర్చుతుంది . మెదడుకు సంబంధించిన రుగ్మతలను నివారిస్తుంది . మెదడుకు బలాన్ని చేకూర్చి మనస్సుకు హాయిని కలిగిస్తుంది.
15)హస్త ప్రయోగం  మరియు స్వప్న స్కలనాలు(Night Fall) : ముఖ్యంగా నేడు యువకులు ఎదురుకుంటున్న’హస్త ప్రయోగం ‘(Masturbation) స్వప్న స్కలనాల(Nightfall)కు ప్రధాన కారణం ? వారు సేవించే వేడి పదార్ధాలు , టీనేజ్ లో శరీరంలో కలిగే మార్పులు , చూస్తున్న అశ్లీల చిత్రాలు , వాటి వల్ల వారి ఆలోచన స్థితి వక్రమార్గం పట్టి లేనిపోని అలవాట్లకు లోనవుతున్నారు . హస్తప్రయోగం , స్వప్న స్కలనాలు వలన నీరసం , అంగం చిన్నదై పోవడమే కాదు . శక్తి హీనులుగా తయారవుతారు . వీటిని జయించాలంటే ? కలబందను పటికబెల్లంతో సేవిస్తే , పై సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది . చాలామంది యువకులకు ఈ చెడులవాటు ఉంటుంది కానీ ఎవరికీ చెప్పుకోలేక మథన పడుతూ ఉంటారు . ఎటువంటి అనారోగ్య అలవాట్లు ఉన్నా , కలబందను సేవించడం ద్వారా తక్షణం వాటి నుండి విముక్తి పొందవచ్చును . ఒకటి కాదు రెండు కాదు , సమస్త వ్యాధుల నివారణకు ‘కలబంద’ ను సేవించడం ద్వారా వ్యాదులన్నింటిని  నియంత్రించుకోవచ్చును
కలబందలో జీవ కణాలను పునర్జీవింపచేసే శక్తి ఉంది . అంతే కాదు . మనిషి ఆయుష్ ని పెంచి , దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించేందుకు ఉపయోగపడుతుంది . లక్షలాది జీవకణాలతో ఏర్పడినది ఈ మానవ శరీరం – నలభై సంత్సరాలు దాటిన వ్యక్తికి రోజుకు 1000 పైగా జీవకణాలు అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు . అందువల్ల నలభై ఏళ్ళు దాటిన వారిలో మతిమరుపు , నీరసం , రోగాలు రావడం , వృద్ధ్యాపం రావడం జరుగుతుంది . అదే గనుక జీవకణాలు యాక్టీవ్ గా ఉంటే ? ఎప్పటికీ మనం ఆరోగ్యంగా , ఆనందంగా ఉండవచ్చును . ఆ పనిని కలబంద చేస్తుందని ఆయుర్వేద గ్రంధాల్లో వ్రాయబడింది . అంతేకాదు ఆధునిక వైద్యులు కూడా క్రమం తప్పకుండా సేవించడం ద్వారా ఎప్పటికీ ఆరోగ్యవంతులుగా ఆనందంగా జీవించవచ్చును . ఇంకో గొప్ప విషయం ఉంది . అది ఏమిటంటే ? కలబంద సేవించడం వల్ల పాజిటివ్ దృక్పథం అలవడుతుందని , ఫిలాసాఫికల్ థాట్స్ కలుగుతాయి . మనలో ఉండే కోపతాపాలను అణచివేసి శాంతస్వభావాన్ని , మానవత్వాన్ని అభివృద్ధి పరచి , ఆధ్యాత్మిక భావన కలిగిస్తుంది . మెడిటేషన్ , యోగ వంటివి చేసే వారికి , సుఖమయ జీవనం గడిపే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందనుటలో సందేహం లేదు . కలబందను ప్రతి ఒక్కరూ ఆరోగ్య దేవతగా భావించి , సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కావాలని , ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాం .
పైసా ఖర్చు లేకుండా మీ పెరట్లో ‘కలబంద ‘ మొక్కలను పెంచుకుంటూ , ప్రతి రోజూ కలబందను సేవించడం ద్వారా ఆరోగ్యవంతులుగా మారవచ్చును . కలబందలో అనేక విటమిన్స్ , ఎంజైమ్స్ , ప్రోటీన్స్ , కాల్షియం వంటివి మానవ దేహానికి కావాల్సిన అన్ని రకాలు ఇందులో ఇమిడి ఉంటాయి.
#Aloevera #kidneyproblems #Asthma #nightfall #memoryloss #piles #constipation #meditaion #diabetic
Follow Facebook

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *